NTV Telugu Site icon

Viral Video : ఏం క్రియేటివిటి బాసూ.. ఇంజనీర్లు పనికిరారు.. వీడియో చూస్తే షాకే..

Statue

Statue

దేశ వ్యాప్తంగా వినాయక చవితి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి.. ఇంజనీర్లను కూడా పక్కన పెట్టేసేలా వినాయకుడి విగ్రహాలను అద్భుతంగా తయారు చేశారు.. ఒక్కో విగ్రహం ఒక్కో వింతను తలపిస్తుంది.. అద్భుతలను సృష్టించారు.. చంద్రయాన్ 3 వినాయక మండపం అందరిని ఆకట్టుకోగా, ల్యాండింగ్, టెకాఫ్ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఇప్పుడు మరో వినాయకుడి వీడియో ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తుంది.. ఆ విగ్రహాన్ని చూస్తే నిజంగానే వినాయడును చూసినట్లే ఉంటుంది.. సజీవంగా ఉండే వినాయకుడిని చూసినట్లే ఉంటుంది.. ఆ విగ్రహ ప్రత్యేకతలు ఏంటో ఒకసారి చూసేద్దాం..

సోషల్ మీడియాలో వినాయక విగ్రహంకు సంబంధించి గతేడాది వీడియో తాజాగా వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న వీడియోలో కూర్చుని ఉన్న వినాయకుడు భక్తులు వచ్చి పాదాలు తాకగానే వారిని ఆశీర్వదిస్తున్నట్లుగా లేచి నిలబడతాడు.. మళ్లీ ఆశీర్వదించి యదాస్థానంలో కూర్చుంటాడు.. నిజంగానే వినాయకుడా అనే సందేహం కూడా జనాలకు కలుగుతుంది.. మాయల పకీర్ ప్రాణం చిలకలో ఉన్నట్లు.. ఈ వినాయకుడుకు పాదాల్లో ఉంది.. ఈ వీడియో ప్రస్తుతం మీడియాలో తెగ వైరల్ అవుతుంది..

వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని సతారా జిల్లాకు చెందిన ఓ శిల్పి వినాయకుడి విగ్రహాన్ని తయారు చేశారు. విగ్రహం పాదాలను తాకగానే నిలబడి ఉంటుంది.విగ్రహం పాదాలను తాకేందుకు ఓ వ్యక్తి ముందుకు వంగినట్లు వీడియోలో ఉంది. అప్పుడు విగ్రహం పైకి లేచి మనిషిని ఆశీర్వదించడానికి తన కుడి చేతిని ముందుకు కదిలిస్తుంది. ఇది సోషల్ మీడియాలో గతేడాది వీడియో కాగా నేడు వైరల్ అవుతోంది.. నిజంగా ఇలాంటి ఆలోచన రావడం గ్రేట్.. ఈ వీడియోను చూసిన వారంతా రకరకాల కామెంట్స్ తో విగ్రహాన్ని తయారిదారిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.. మొత్తానికి వీడియో మరోసారి ట్రెండ్ అవుతుంది.. ఒక లుక్ వేసుకోండి..