Site icon NTV Telugu

Vimanam : ఓటీటీ లో అదరగొడుతున్న ఫీల్ గుడ్ మూవీ.

Whatsapp Image 2023 07 01 At 3.05.46 Pm

Whatsapp Image 2023 07 01 At 3.05.46 Pm

సముద్రఖని.. ఈ పేరు గురించి ప్రత్యేకం గా పరిచయం అవసరంలేదు. తన అద్భుతమైన నటనతో అందరినీ మెప్పించాడు. తెలుగులో వరుసగా ప్రతినాయకుడు పాత్రలు చేస్తూ అదరగోడుతున్నాడు. స్టార్ హీరోలకు విలన్ గా సముద్రఖనీ మంచి ఆప్షన్ గా మారాడు.అయితే నటుడిగా కంటే ముందు దర్శకుడి గా టాలీవుడ్​కు ఎంట్రీ ఇచ్చారు సముద్రఖని. రవితేజ, అల్లరి నరేష్, శివ బాలాజీ​ కలసి నటించిన ‘శంభో శివ శంభో’ సినిమాతో డైరెక్టర్ గా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు.. ఆ తర్వాత కాలంలో ఆయన నటుడిగా కూడా మెప్పించారు.రీసెంట్ గా సముద్రఖని ప్రధాన పాత్ర లో యాక్ట్ చేసిన మూవీ ‘విమానం’. ఇందులో ఆయన తో పాటు అనసూయ భరద్వాజ్, మీరా జాస్మిన్ మరియు మాస్టర్ ధ్రువన్ కీలక పాత్రల్లో నటించారు.. శివ ప్రసాద్ యానాల తెరకెక్కించిన ‘విమానం’ సినిమా జూన్ 9న థియేటర్లలో విడుదల అయింది.’విమానం’ కలెక్షన్ల పరంగా అంతగా రానించక పోయినా.మంచి చిత్రంగా ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది.

స్టార్ నటి అనసూయ ఇందులో వేశ్య పాత్రలో కనిపించడం విశేషం.. ఎప్పటిలాగే తనకు ఇచ్చిన పాత్రకు అద్భుతమైన పెర్ఫార్మన్స్ ఇచ్చింది.. అయితే తాజాగా ఈ మూవీ ఓటీటీ లో స్ట్రీమింగ్​ అవుతుంది.ప్రముఖ ఓటీటీ ప్లాట్​ఫామ్ జీ5లో జూన్ 30 నుంచే ‘విమానం’ స్ట్రీమింగ్ అవుతోంది. జీ5 సంస్థ ఈ విషయాన్ని తెలుపుతూ ఒక ప్రత్యేక వీడియోను కూడా రిలీజ్ చేసింది. ఈ మూవీలో విమానం ఎక్కాలనే కొడుకు కోరిక తీర్చడం కోసం తండ్రి పడిన కష్టాలు ఎంతో అద్భుతంగా చూపించారు.తండ్రీ కొడుకుల సెంటిమెంట్​తో సాగే సీన్స్ ప్రేక్షకులను కంట తడి పెట్టిస్తాయి..కొడుకు కోరికను తీర్చే తండ్రి పాత్ర లో సముద్రఖని జీవించారని చెప్పొచ్చు.థియేటర్ లో ఈ సినిమాను మిస్ అయిన వారు ఓటీటీ లో చూడవచ్చు.ఓటీటీ లో ఈ సినిమా మంచి వ్యూస్ సాధిస్తూ దూసుకుపోతుంది.

Exit mobile version