Site icon NTV Telugu

Vimal Masala Soda: ఎంతకు తెగించార్రా.. విమల్ పాన్ మసాలా ట్రై చేసారా మీరు.. వీడియో వైరల్

Vimal

Vimal

Vimal Masala Soda: ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా పుణ్యమా అంటూ వివిధ రకాల స్ట్రీట్ ఫుడ్స్ వీడియోలు వైరల్ అవుతున్నాయి. వీటిలో కొన్ని వంటకాలు ప్రజల దృష్టిని ఆకర్షించే విధంగా ఉంటాయి. మరికొన్ని చూస్తూనే భయపడేలా చేస్తాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో ఒక ప్రత్యేక రకం షోడా గురించి. విమల్ పాన్ మసాలా కలిపి కొత్త రకమైన మసాలా షోడా తయారు చేసారు. సోషల్ మీడియాలో ఈ వీడియో చూసిన వారంతా ఇప్పుడు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

Also Read: WhatsApp Update: చాట్ లిస్ట్ కోసం కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్న వాట్సాప్

ఈ వీడియోను వైరల్ బ్రిజేష్ వ్లాగ్స్ అనే ఖాతా ద్వారా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. స్పెషల్ విమల్ షికంజీ అంటూ దాని క్యాప్షన్ ను జత అచేసారు. వైరల్ అవుతున్న వీడియోలో ఓ ప్రత్యేక రకం మసాలా షోడా సిద్ధం చేస్తున్నట్లు వీడియోలో చూపించారు. ఈ మసాలా షోడాను తయారు చేయడానికి నిమ్మ, అల్లం, పుదీనా లాంటి వాటిని కలుపుతారు. దీని తర్వాత, అతను విమల్ పాన్ మసాలా ప్యాకెట్‌ను చింపి, దానిని కలుపుతాడు. దీని తరువాత ఆ మసాలా సోడాను ఒక స్ట్రాతో కలుపుతారు.

Also Read: Relationship Tips: ఆ సమస్యల కారణంగా లైంగిక జీవితంలో ఇబ్బందులు రావచ్చు.. జాగ్రత్త మరి

ఈ వీడియో చూసిన తర్వాత నెటిజన్లు చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో కొందరేమో అసలు ఎలా వస్తాయి ఇలాంటి ఆలోచనలు అని కామెంట్ చేస్తుండగా.. మరికొందరేమో అబ్బా ఏం టాలెంట్ గురూ అని కామెంట్ చేస్తున్నారు.

Exit mobile version