NTV Telugu Site icon

AP Elections 2024: పోలింగ్‌ బూత్‌లో గందరగోళం.. పీవోను చితకబాదిన గ్రామస్తులు.. నిలిచిపోయిన పోలింగ్‌..!

Po

Po

AP Elections 2024: విజయనగరం జిల్లా గజపతినగరం మండలం కొత్తశ్రీరంగరాజపురంలో దాదాపు రెండు గంటలుగా పోలింగ్‌ నిలిచిపోయింది.. పోలింగ్ కేంద్రంలో పీవోగా ఉన్న రాంబాబు.. ఒక పార్టీకి కొమ్ముకాస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి.. ఈ వ్యవహారాన్ని పీవో రాంబాబు చూసిచూడనట్లుగా వ్యవహరిస్తున్నారని గుర్తించిన స్థానికులు.. అతడిపై దాడికి దిగారు.. వృద్దులు ఓట్లును టీడీపీకి ప్రభావితం చేసినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.. ఈ నేపథ్యంలోనే పీవో రాంబాబుని చితకబాదారు గ్రామస్తులు.. ఇక, పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో పీవోను విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నారు సంబంధిత అధికారులు. దీంతో.. పోలింగ్ కేంద్రం వద్ద గందరగోళ పరిస్థితి ఏర్పడింది.. రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.. కాగా, ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల వేళ.. పలు ప్రాంతాల్లో ఘర్షణలు, దాడులు జరిగగా.. అవి మినహా.. రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్‌ ప్రశాంతంగా సాగుతున్నట్టు అధికారులు చెబుతున్నారు.

Read Also: Madhavilatha : మాధవిలతపై ఈసీకి ఎంఐఎం ఫిర్యాదు.. కౌంటర్‌ ఇచ్చిన మాధవి లత

Show comments