రాష్ట్ర ప్రజల ఎంతో ఉత్కంఠ ఎదురుచూస్తున్న మునుగోడు ఉప ఎన్నిక ముగింపు దశకు చేరుకుంది. నేటి ఉదయం 7 గంటలకు ఉప ఎన్నికకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు భారీగా క్యూలైన్లలో వేచిఉన్నారు. అయితే.. కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో ఓటర్లు అవస్థలు పడ్డారు. ఎండకు క్యూలైన్లలో నిలుచొని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అయితే తాజాగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ మాట్లాడుతూ.. సాయంత్రం 6 గంటల తర్వాత క్యులైన్ లో చాలా మంది ఉన్నారన్నారు. పోలింగ్ పూర్తి కావడానికి ఇంకా టైం పడుతుందని, కొన్ని చోట్ల చిన్న గొడవలు జరిగాయన్నారు. 6100 లీటర్ల మద్యం సీజ్ చేశామని, 191 FIR లు ఫైల్ అయ్యాయన్నారు.
Also Read : India Reaction: ఇమ్రాన్‌ఖాన్‌పై హత్యాయత్నం.. స్పందించిన భారత్
8.27 కోట్ల విలువైన నగదు, బంగారం, చీరలు స్వాధీనం చేసుకున్నామన్నారు. మొత్తం 56 కేసులు నమోదు చేశామని, ఇవాళ 98 ఫిర్యాదులు వచ్చాయని, 72 మంది నాన్ లోకల్స్ నీ బయటికి పంపించేశామన్నారు. నల్గొండ లోని స్ట్రాంగ్ రూమ్ లో ఈవీఎం, వీవీ పాడ్‌లను లను భద్రపరుస్తామన్నారు. అన్ని పార్టీల నుంచి కన్సర్న్ పేపర్ తీసుకుంటామని, కౌంటింగ్ స్టాఫ్ కి కూడా ట్రైనింగ్ ఇచ్చామని, మైక్రో అబ్జర్వర్ కి ట్రైనింగ్ ఇచ్చామన్నారు. 6వ తేదీ మార్నింగ్ 8 గంటల నుండి ఓట్ల లెక్కింపు స్టార్ట్ చేస్తామని, స్ట్రాంగ్ రూమ్ కు భద్రత కల్పించామన్నారు. ఇవాళ పోలింగ్ పూర్తి కాగానే పోలింగ్ యంత్రాలను స్ట్రాంగ్ రూమ్ కు తరలిస్తామన్నారు.