గణేష్ నిమర్జనం సమయంలో తాండూరులో జిల్లా పోలీసులను వాడడం మంచి పరిణామం కాదని వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో తాండూర్ పట్టణంలో నిర్వహించిన శాంతి సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.. ఈ సందర్భంగా ఎస్పీ కోటిరెడ్డి మాట్లాడుతూ రాబోయే పరిణామాలను ముందస్తుగా ఆలోచించి నిర్వహించే సమావేశమై శాంతి సమావేశామని ఆయన పేర్కొన్నారు. తాండూర్ ప్రజలపై పూర్తి ప్రగాఢ నమ్మకం ఉందని వచ్చే నిమర్జనం వేడుకల్లో శాంతి భద్రతలకు భంగం కలుగకుండా ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని దానికి పోలీసులు కూడా సహకరిస్తారిని ఎస్పీ కోటిరెడ్డి వెల్లడించారు.
Read Also: Rashmika Mandanna: రష్మికను చూసి ముఖం తిప్పుకున్న ప్రభాస్ హీరోయిన్..
అయితే, జిల్లాలో మొత్తం మూడు వేల విగ్రహాలను ఏర్పాటు చేయడం జరిగిందని ప్రతి సంవత్సరం జిల్లాలో ఎక్కడ లేని విధంగా తాండూరులో పెద్ద ఎత్తున పోలీస్ సిబ్బందిని బందోబస్తుగా నిమర్జన కార్యక్రమానికి ఉంచడం జరుగుతుందని ఎస్పీ కోటిరెడ్డి అన్నారు. డీజేలు వాడడం వల్ల అనారోగ్య సమస్య వినికిడి సమస్య బారిన పాడే ప్రమాదం ఉందని ఎక్కడైనా శాంతి భద్రతల సమస్య వచ్చిన దానిని చూసుకునేందుకు పోలీస్ సిబ్బందితో పాటు నేను అందుబాటులో ఉంటానని ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో తాండూర్ డీఎస్పీ శేఖర్ గౌడ్, సీఐలు రాజేందర్ రెడ్డి, రాంబాబు, పెద్దముల్, బషీరాబాద్, యాలాల్, తాండూర్ ఎస్ఐలతో పాటు సిబ్బంది గణేష్ మండపాల కమిటీ నిర్వాహకులు, సభ్యులు వివిధ మతాల పెద్దలు నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Read Also: Women Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లు.. వ్యతిరేకంగా ఓటేసిన ఇద్దరు ఎంపీలు ఎవరంటే?