Vikaas Hospitals: మారుతోన్న ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఆస్పత్రులకు ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది.. ఆస్పత్రి అందుబాటులో ఉండడం కాదు.. అందులో అన్ని సదుపాయాలు, అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయా? అనేది కూడా ముఖ్యం.. ఇప్పుడు గుంటూరు, పరిసర ప్రాంతాల ప్రజలకు అన్ని సదుపాలతో కొత్త ఆస్పత్రి ప్రారంభానికి సిద్ధం అవుతోంది.. నవంబర్ 1వ తేదీన వికాస్ హాస్పిటల్స్ ప్రారంభించబోతున్నారు.. నవంబర్ 1వ తేదీన ఉదయం 10.52 గంటలకు గుంటూరులోని నగరంపాలెం (కలెక్టరేట్ రోడ్)లో ఈ ఆస్పత్రిని ప్రారంభించనున్నారు.
అపార నైపుణ్యం, అనుభవం కలిగిన డాక్టర్ల బృందంతో.. అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో.. మల్టీ స్పెషాలిటీ సేవలు అందించేందుకు సిద్ధమవుతోంది వికాస్ హాస్పిటల్స్..ఇక, వికాస్ హాస్పిటల్స్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వికాస్ హాస్పిటల్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గళ్లా రామచంద్రరావు.. హాస్పిటల్ డైరెక్టర్, కార్డియాలజిస్ట్ డా. సుధాకర్ కనుమూరి, హాస్పిటల్ డైరెక్టర్, వాస్కులర్ సర్జన్ డా. సరేంద్ర నాగులపాటి, హాస్పిటల్ డైరెక్టర్, నెఫ్రాలజిస్ట్ అండ్ ట్రాన్స్‌ప్లాంట్ ఫిజిషియన్ డా. నిహారిక, హాస్పిటల్ డైరెక్టర్, అనస్థీషియాలజిస్ట్ అండ్ క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ డా. కనక దుర్గ సహా.. పలువురు డాక్టర్లు, సిబ్బంది పాల్గొననున్నారు. మొత్తంగా అన్ని సదుపాయాలతో గుంటూరు వాసులకు మరో కొత్త ఆస్పత్రి అందుబాటులోకి రాబోతోంది.. నవంబర్ 1వ తేదీన జరగనున్న ప్రారంభోత్సవానికి అందరినీ ఆహ్వానిస్తోంది వికాస్ హాస్పిటల్స్.