టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాది గుంటూరు కారం సినిమాతో మిక్సీ్డ్ టాక్ ను అందుకున్నా కూడా భారీ కలెక్షన్స్ ను అందుకున్నాడు.. ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తున్నట్లు ఎప్పుడో ప్రకటించారు కానీ సినిమా గురించి ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన రాకపోవడంతో ఆయన ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు..ఈ సినిమా షూటింగ్ ఇదిగో ఇప్పుడే మొదలవుతుందని చెప్తున్నారు.. కానీ సినిమా షూటింగ్ ను మాత్రం మొదలు పెట్టలేదు.. అయితే ప్రస్తుతం ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది..
సాదారణంగా జక్కన్న సినిమాలంటే ఇండస్ట్రీలో ఓ రేంజులో అంచనాలు ఉంటాయి.. గతంలో వచ్చిన RRR సినిమా ఆస్కార్ వరకు వెళ్లింది.. ఇప్పుడు మహేష్ సినిమా కూడా అంతే హిట్ టాక్ ను అందుకుంటుందని జనాలు అభిప్రాయ పడుతున్నారు.. ఇక ఈ సినిమా కథను ఎప్పుడో సిద్ధం చేసినట్లు రైటర్ విజేంద్ర ప్రసాద్ చెప్పిన విషయం తెలిసిందే.. అంతేకాదు సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ఎప్పుడో మొదలయ్యాయి.. ఈ సినిమాకు బుర్రా సాయి మాధవ్ డైలాగ్స్ రాస్తున్నారని సమాచారం.
ఇక ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. సినిమా కథపై సంచలన విషయాన్ని బయట పెట్టారు.. ఈ సినిమా కథను ఓ ఇంగ్లిష్ కథల పుస్తకం నుంచి తీసుకున్నట్లు చెప్పారు.. రాజమౌళికి దక్షిణాఫ్రికా నవలా రచయిత విల్బర్ స్మిత్ రచనలు ఇష్టం. ఆయనకు మేమిద్దరం అభిమానులం. ఆయన పుస్తకాలన్నీ చదివాం. వాటి ఆధారంగా ఈ సినిమా స్క్రిప్ట్ రాసుకున్నాను అని తెలిపారు.. ఈ వార్త పై రకరకాల పూకార్లు పుట్టుకోస్తున్నాయి.. ఈ సినిమా కథ కాపీనా అంటూ యాంటి మహేష్ ఫ్యాన్స్ స్ప్రెడ్ చేస్తున్నారు.. అయితే ఇది కొన్ని పుస్తకాల ఆధారంగా తీసుకున్న ఊహత్మక కథ అని తెలుస్తుంది.. ఏది ఏమైనా మహేష్ కొత్త లుక్ లో కనిపించడం మాత్రమే కాదు.. సినిమా అడ్వెంచర్ థ్రిల్లర్ గా ఉండబోతుందని ఇప్పట్నుంచే అభిమానులు, సినీ ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకుంటున్నారు.. సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు..