NTV Telugu Site icon

Maharaja Twitter Review: మహారాజా ట్విట్టర్ రివ్యూ.. హిట్ కొట్టిందా?

Maharajaaaaaa

Maharajaaaaaa

ప్రముఖ తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి గురించి అందరికీ తెలుసు.. విలక్షణ నటుడుగా ఎన్నో హిట్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు.. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నటించిన తాజా చిత్రం మహారాజా.. ఈ సినిమాకు మొదటి నుంచి భారీ అంచనాలు క్రియేట్ అవుతున్నాయి.. తన కెరియర్ లోనే 50వ సినిమాగా రూపొందిన ఈ సినిమాకి నితిలాన్ దర్శకత్వం వహించారు. తమిళ్, తెలుగు భాషల్లో జూన్ 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా పబ్లిక్ టాక్ ఎలా ఉంది.. ట్విట్టర్ ద్వారా ఎలాంటి టాక్ ను అందుకుందో చూద్దాం..

సినిమాకి స్క్రీన్ ప్లే నే అత్యంత బలం.. స్టోరీ చెప్పిన విధానం ఫస్ట్ ఆఫ్ కి బలం.. సెకండ్ హాఫ్ లో దర్శకుడు ఎమోషన్స్ ని దట్టించి అదరగొట్టేశాడు.. సెకండ్ ఆఫ్ సినిమాకు హైలెట్ గా నిలిచింది అంటూ ఓ యూజర్ ట్వీట్ చేశాడు..

మరొకరు ఫస్ట్ ఆఫ్ లో కామెడీ కాస్త సస్పెన్స్ లాంటివి పాజిటివ్ అంశాలుగా నిలిచాయి.. ఇక విజయ్ సేతుపతికి కచ్చితంగా కం బ్యాక్ మూవీ.. అనురాగ్ కశ్యప్ యాక్టింగ్ చూస్తే ఖచ్చితంగా థ్రిల్ అవుతారు..సినిమాలో నటించిన ప్రతి ఒక్కరు కూడా బాగా నటించారు..

విజయసేతుపతికు 50వ చిత్రం బెస్ట్ సినిమా.. ఈ సంవత్సరం ఇప్పటివరకు వచ్చిన బెస్ట్ సినిమాలలో ఇది కూడా ఒకటి.. చాలా అద్భుతంగా ఉందని చెప్పుకొచ్చారు..

మొత్తంగా చూసుకుంటే ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది… రేటింగ్ విషయానికొస్తే.. నెటిజన్స్ 4/5 రేటింగ్ ఇచ్చారు.. ఈ విధంగా చూసుకుంటే సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది..