Site icon NTV Telugu

Stone Attack on CM Jagan: సీఎం జగన్ దాడి ఘటన.. బెజవాడ పోలీసుల కీలక ప్రకటన

Vja Police

Vja Police

Stone Attack on CM Jagan: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిపై విజయవాడలో జరిగిన దాడి ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.. ఈ ఘటనతో పోలీసులపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి.. ఈ నేపథ్యంలో.. సీఎం జగన్ దాడి విషయంలో బెజవాడ పోలీసుల కీలక ప్రకటన చేశారు.. సీఎం జగన్‌పై దాడి చేసిన వారి వివరాలు చెప్పిన వారికి నగదు బహుమతి ప్రకటించారు ఈ మేరకు ఎన్టీఆర్‌ జిల్లా పోలీస్ కమీషనర్ కార్యాలయం నుంచి ఓ ప్రకటన వెలువడింది.. గౌరవ ముఖ్యమంత్రి గారిపై దాడి చేసిన వారి వివరాలను తెలిపిన వారికి నగదు బహుమతి ఉంటుందని పేర్కొన్నారు..

Read Also: PM Modi: ‘‘ఓటు బ్యాంకు కారణంతోనే కాంగ్రెస్ హాజరుకాలేదు’’ .. అయోధ్య మందిర ఆహ్వానం తిరస్కరించడంపై పీఎం మోడీ..

సీఎం జగన్‌పై దాడి చేసిన నిందితులను పట్టుకొవడంలో ప్రజలు దోహదపడాలని విజ్ఞప్తి చేశారు బెజవాడ పోలీసులు.. ఖచ్చితమైన సమాచారాన్ని దృశ్యాలను (సెల్ ఫోన్, వీడియో రికార్డింగ్స్) అందించవచ్చు అని సూచించారు. ప్రత్యక్ష సాక్షులు ఎవరైనా కూడా నేరుగా వచ్చి సమాచారం ఇవ్వొచ్చని పేర్కొన్నారు.. కేసుకు దోహదపడే సమాచారం అందించిన వారికి రూ. 2 లక్షల నగదును బహుమతి ఇస్తామని.. సమాచారాన్ని అందించిన వారి వివరాలను పూర్తి గోప్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు.. ఇక, సమాచారం తెలిపే వాళ్లు.. కంచి శ్రీనివాస రావు, డీసీపీ (9490619342) లేదా ఆర్.శ్రీహరిబాబు, ఏడీసీపీ టాస్క్ ఫోర్సుకు ఏ.డి.సి.పి.టాస్క్ ఫోర్స్ (9440627089)కు తెలియజేయాలంటూ వారికి సంబంధించిన ఫోన్‌ నంబర్లను కూడా పేర్కొన్నారు పోలీసులు. అంతే కాకుండా కమిషనర్స్‌ టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయం, నేతాజీ బ్రిడ్జి రోడ్‌, పశువుల ఆస్పత్రి పక్కన. లబ్బిపేట, కృష్ణలంక, విజయవాడ అంటూ.. ఆఫీస్‌ అడ్రస్‌ను కూడా పేర్కొన్నారు.

Exit mobile version