Site icon NTV Telugu

Kesineni Nani: స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం చరిత్రలోనే ఒక అధ్యాయం

Nani

Nani

సీఎం జగన్ (CM Jagan) బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని విజయవాడ ఎంపీ కేశినేని నాని (Kesineni Nani) అన్నారు. విజయవాడలో జరిగిన బీసీల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సామాజిక న్యాయ విధాత సీఎం జగన్ అంటూ కొనియాడారు. చంద్రబాబు పోకడలతో విసిగిపోయి జగన్ వెంట నడుస్తున్నానని తెలిపారు. గ్రామాల్లోకి వెళ్తుంటే ఆర్బీకేలు, గ్రామ సచివాలయాలు, డిజిటల్ లైబ్రరీలు, నాడు-నేడు ద్వారా మారిన స్కూల్స్ కనిపిస్తున్నాయని చెప్పుకొచ్చారు. మానవ అభివృద్ధే అసలైన అభివృద్ధి అని తెలిపారు. పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం భారతదేశ చరిత్రలోనే ఒక అధ్యాయంగా మిగిలిపోతుందని చెప్పుకొచ్చారు.

చంద్రబాబు ఒక్క బీసీని మాత్రమే రాష్ట్ర అధ్యక్షుడు మాత్రమే పెట్టారని ఆరోపించారు. జగన్.. బీసీని మైలవరం ఎమ్మెల్యేగా, ఏలూరు, నర్సరావుపేట ఎంపీలుగా బీసీలకు టికెట్స్ ఇచ్చిన ఘనత జగన్‌కే దక్కుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వందలామంది బీసీలకు రాజకీయంగా పదవులు ఇచ్చారన్నారు. బీసీలకు ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు ఇచ్చి గెలిపించిన చరిత్ర చంద్రబాబుకు లేదని విమర్శించారు.

ఐఓసీ తీరుపై అసహనం..
ఎన్టీఆర్ జిల్లా కొండపల్లిలో ఐఓసీ తీరుపై ఎంపీ కేశినేని నాని అసహనం వ్యక్తం చేశారు. సీఎంఆర్ ఫండ్స్ ప్రాంతీయంగా ఖర్చు పెట్టాలని డిమాండ్ చేశారు. తాను ఎంపీగా 10 సంవత్సరాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నా ఏనాడు తనను కలవలేదంటూ మండిపడ్డారు. మళ్లీ ఎన్నికల్లో ఎంపీగా తానే గెలవబోతున్నానంటూ ధీమా వ్యక్తం చేశారు. మాట్లాడుతూనే హలో మిమ్మల్నే.. మీరు వినాలి అంటూ జీఎంపై అసహనం వ్యక్తం చేశారు.
ఇక్కడ ప్రజలు కాలుష్యం బారిన పడుతున్నారు కాబట్టే సీఎంఆర్ ఫండ్స్ స్థానికంగా ఖర్చు పెట్టాలని డిమాండ్ చేశారు. అనంతరం పీఎం ఇంధన కంపెనీలకు సంబంధించి మౌళిక వసతుల కల్పన, జాతికి అంకితం కార్యక్రమాన్ని కేశినేని నాని వీక్షించారు.

Exit mobile version