Site icon NTV Telugu

Vijayawada: మతిస్థిమితం లేని యువతిపై అత్యాచారం.. దాచిపెడుతున్న పోలీసులు..?

Odisharape

Odisharape

Vijayawada rape case: విజయవాడ కొత్తపేట పోలీసుల నిర్లక్ష్యం బట్టబయలైంది. విజయవాడ పంజా సెంటర్ దగ్గర మతిస్థిమితం లేని అమ్మాయిని అర్ధరాత్రి యువకుడు రేప్ చేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన చోటు చేసుకుంది. గుర్తు తెలియని యువకులు రేప్ చేసిన మతిస్థిమితం లేని అమ్మాయిని విజయవాడ స్వరంగం దగ్గర పడేశారు. ప్రస్తుతం ఆ అమ్మాయి గవర్నమెంట్ హాస్పిటల్‌కు తరలించారు. ఈ అంశం బయటకు రాకుండా టూ టౌన్ సీఐ కొండలరావు గోప్యంగా ఉంచుతున్నారు. కనీసం నిందితుడిపై కేసు నమోదు చేశారా? లేదా అనే విషయంపై కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేదు. ఫోన్‌లో సైతం అందుబాటులోకి రాకుండా తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు సీఐ కొండలరావు. నిందితుడిని గుర్తించారా? అరెస్ట్ చేశారా? అనే అంశంపై క్లారిటీ లేదు. మతిస్థిమితం లేని అమ్మాయి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని సమాచారం కూడా లేదు. పోలీసుల నిర్లక్ష్యంపై స్థానికంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సీఐ ఈ అంశాన్ని బయటకు రాకుండా ఎందుకు జాగ్రత్తలు తీసుకున్నారనే అంశంపై స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

READ MORE: Concussion: టీమిండియా పేసర్ తలకు గాయం.. మ్యాచ్ మధ్యలో నుంచే ఆస్పత్రికి!

Exit mobile version