Site icon NTV Telugu

Vijayashanti: సీఎంతో సమావేశానికి విజయంతి గైర్హాజరు.. కారణమేంటంటే?

New Project (16)

New Project (16)

కొద్దిసేపట్లో సచివాలయంలో రాజీకయ పార్టీలతో సీఎం రేవంత్‌ రెడ్డి సమావేశం నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ భేటీలో రాష్ట్ర గీతం, చిహ్నంపై ప్రభుత్వ నిర్ణయాన్ని పార్టీల ప్రతినిధులకు సీఎం రేవంత్ రెడ్డి వివరించనున్నారు. ఈ సమావేశానికి విజయశాంతిని కూడా ఆహ్వానించారు. కాని విజయశాంతి గైర్హాజరవుతున్నారు. సినిమా షూటింగ్‌ షెడ్యూల్‌ కారణంగా సమావేశానికి హాజరుకాలేకపోతున్నట్లు ఆమె స్పష్టం చేశారు. ముందే సినిమా సెడ్యూల్ నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. ముంబైతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ఆర్టిస్ట్‌లను దృష్టిలో ఉంచుకుని షుటింగ్ కి వెళ్తున్నారు.

READ MORE: Lava Yuva 5G: రెండు స్టోరేజ్ వేరియంట్లలో కొత్త 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసిన లావా..

కాగా.. సినిమాల్లో నటిస్తూనే రాజకీయాల్లోకి వచ్చిన విజయశాంతి మొదట్లో బీజేపీకి మద్దతుదారుగా ఉన్నారు. ఆ తర్వాత బీజేపీకి స్టార్‌ క్యాంపెయినర్‌గా వ్యవహరించారు. మొదట్లో పరోక్ష రాజకీయాల్లో కీలకంగా ఉన్న విజయశాంతి.. 1998లో బీజేపీలో చేరారు. 1999 లోక్ సభ ఎన్నికల్లో కడప లోక్‌సభ స్థానం నుంచి సోనియా గాంధీపై పోటీ చేయాలనుకున్నారు. అయితే సోనియా గాంధీ బళ్లారి నుంచి పోటీ చేయడంతో… విజయశాంతి పోటీ నుంచి తప్పుకున్నారు. 2009 వరకు బీజేపీలో ఉన్న విజయశాంతి.. ఆ తర్వాత తల్లీ తెలంగాణ పేరుతో సొంత పార్టీని పెట్టారు. ఆ తర్వాత కేసీఆర్ పిలుపు మేరకు ఆ పార్టీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేశారు. 2009లో మెదక్‌ లోక్ సభ స్థానానికి టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం కేసీఆర్‌తో విభేదాల రావడంతో 2014లో టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్‌ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్‌లో స్టార్‌ క్యాంపెయినర్‌, ఎన్నికల ప్రచార కమిటీ సలహాదారుగా పనిచేశారు. అయితే 2020లో కాంగ్రెస్‌కు రాజీనామా చేసి మళ్లీ బీజేపీలో చేరారు. ప్రస్తుతం కాంగ్రెస్ లో కొనసాగుతున్నారు.

Exit mobile version