NTV Telugu Site icon

Vijayakanth COVID-19: కెప్టెన్ విజయ్‌కాంత్‌కు కరోనా.. అత్యంత విషమంగా ఆరోగ్య పరిస్థితి!

Tamil Hero Vijayakanth Test Positive for COVID-19: ప్రముఖ తమిళ నటుడు, డీఎండీకే వ్యవస్థాపకుడు విజయకాంత్‌కు కరోనా సోకింది. ఈ విషయాన్ని డీఎండీకే పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది. శ్వాస సమస్య కారణంగా విజయకాంత్‌ను ప్రస్తుతం వెంటిలేటర్‌పై ఉంచినట్లు తెలిపింది. విజయకాంత్‌ గత కొన్నాళ్లుగా పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. దానికి తోడు ఇప్పుడు కరోనా సోకడంతో ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. విషయం తెలిసిన కెప్టెన్ విజయకాంత్‌ ఫాన్స్, డీఎండీకే నేతలు ఆందోళన చెందుతున్నారు.

గత కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విజయకాంత్‌.. పార్టీ సమావేశాలు, బహిరంగ కార్యక్రమాలు వంటి కార్యక్రమాల్లో పాల్గొనకుండా ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. సెప్టెంబర్ 18న జలుబు, దగ్గు, గొంతునొప్పి కారణంగా వైద్య పరీక్షల నిమిత్తం చైన్నెలోని ఓ ఆసుపత్రిలో చేరారు. ఆయనను పరీక్షించిన వైద్యులు కృత్రిమ శ్వాస అందించారు. నవంబర్‌ 23న విజయకాంత్‌ ఆరోగ్యం మెరుగ్గా ఉందని , వైద్యానికి బాగా సహకరిస్తున్నారని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఇక డిసెంబర్ 11న ఆయన డిశ్చార్జి అయ్యారు.

Also Read: IPL 2024: అప్పుడు క్రికెట్‌ కిట్‌ కొనే పరిస్థితి కూడా లేదు.. ఇప్పుడు ఇళ్లు కొంటా: దూబె

డిశ్చార్జి అనంతరం డీఎండికే వర్కింగ్‌ కమిటీ సాధారణ సమావేశాల్లో విజయకాంత్‌ పాల్గొన్నారు. అయితే మంగళవారం రాత్రి చికిత్స కోసం మళ్లీ ఆసుపత్రిలో చేరారు. తాజాగా కరోనా సోకినట్లు డీఎండీకే ప్రధాన కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఆయన ఆరోగ్యం క్షీణించిందని తెలుస్తోంది.

Show comments