NTV Telugu Site icon

Vijay varma : ఆ అభిమాని అడిగిన ప్రశ్నకు మండిపడిన విజయ్ వర్మ..

Whatsapp Image 2023 09 01 At 12.26.04 Pm

Whatsapp Image 2023 09 01 At 12.26.04 Pm

తమన్నా.. ఈ భామ తెలుగులో దాదాపు అందరి స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది.ప్రభాస్, పవన్, మహేష్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రాంచరణ్ ఇలా స్టార్ హీరోలందరితో మిల్కీ బ్యూటీ నటించింది. రీసెంట్ గా ఈ భామ తెలుగులో ఆఫర్స్ తగ్గడంతో బాలీవుడ్ లో వరుస వెబ్ సిరీస్ లలో నటించింది. ఈ వెబ్ సిరీస్ లలో తమన్నా ఎంతో బోల్డ్ గా నటించింది. బెడ్ సీన్స్ తో రెచ్చిపోయింది.అలాగే తెలుగులో రీసెంట్ గా చిరంజీవి సరసన భోళా శంకర్ సినిమాలో అలాగే సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్ సినిమా లో ఈ భామ హీరోయిన్ గా నటించింది.ఇదిలావుంటే ప్రస్తుతం తమన్నా ప్రేమ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది..హిందీ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉన్నట్లు తమన్నా బయటపెట్టింది . ఈ జంట రీసెంట్ గా మాల్దీవ్స్ వెకేషన్ కు వెళ్లారు. తమన్నా మాల్దీవుల నుంచి షేర్ చేసిన పిక్స్ ఇంటర్నెట్ లో బాగా వైరల్ అయ్యాయి.. అంతే కాదు తన ప్రియుడు విజయ్ వర్మతో తమన్నా కలసి వెకేషన్ ఎంతగానో ఎంజాయ్ చేసింది. కానీ తన ప్రియుడికి సంబంధించిన పిక్స్ మాత్రం ఈ భామ రివీల్ చేయలేదు.

తాజాగా వీరిద్దరూ మాల్దీవుల వెకేషన్ ముగించుకుని ఎయిర్ పోర్ట్ లో మెరిశారు. ఇద్దరూ విడివిడిగా ఎయిర్ పోర్ట్ నుంచి బయటకి వచ్చారు.. దీనితో అభిమానులు తమన్నా, విజయ్ వెంట పడ్డారు.తమన్నా మెరూన్ కలర్ టాప్ లో అందాలు వెదజల్లుతూ మెరిసింది. మాల్దీవుల వెకేషన్ ఎలా ముగిసింది.. విజయ్ సర్ రాలేదా అని తమన్నాని వారు ప్రశ్నించారు. దీనితో తమన్నా సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయింది.ఇక విజయ్ వర్మ రాగానే ఆయనకి కూడా ప్రశ్నలు ఎదురయ్యాయి. మాల్దీవుల్లో బాగా మజా చేశారా అంటూ ఎయిర్ పోర్ట్ లో ఓ అభిమాని ఆయనను అడిగారు. దీనితో విజయ్ వర్మ కోపంతో ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు.. మీరు ఇలా మాట్లాడకూడదు అంటూ కోపంతో అక్కడ నుంచి వెళ్లిపోయారు.