NTV Telugu Site icon

Maharaja : ఇది కదా మహారాజా స్టామినా అంటే.. ఏకంగా 40వేల థియేటర్లలో రిలీజ్

Maharajaaaaaa

Maharajaaaaaa

Maharaja : కోలీవుడ్ విలక్షణ నటుడు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హీరోగా నటించిన రీసెంట్ చిత్రం “మహారాజ”. యువ దర్శకుడు నితిలాన్ స్వామినాథన్ దర్శకత్వం వహించాడు. ఎలాంటి అంచనాలు, పెద్దగా ప్రమోషన్స్ లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని విడుదలైన అన్నీ చోట్ల భారీ కలెక్షన్లు రాబట్టింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఊహించని విజయం సాధించి రూ.100 కోట్లకుపైగా వసూలు చేసింది.

Read Also:Off The Record : దువ్వాడ అతి.. ఇబ్బందులు తెస్తోందా..? వరుస కేసులతో ఉక్కిరి బిక్కిరి..!!

కాగా ఈ సినిమాను 20 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కించారు నిర్మాతలు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా చిత్ర హీరో విజయ్ సేతుపతి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఈ చిత్రంలో నటించాడట. సినిమా విడుదలయ్యాక లాభాల్లో వాటా తీసుకోమని కోరగా ఆయన అంగీకరించి ఫ్రీగా ఈ చిత్రంలో నటించారట. విడుదల నాటి నుండి సూపర్ హిట్ తో దూసుకు వెళ్లింది ఈ సినిమా. జూన్ 14వ తేదీన విడుదలైన ఈ సినిమా 50 రోజులు విజయవంతంగా ఆడింది. ఇటు తెలుగులోను మహారాజా సూపర్ హిట్ సాధించింది. రెండు తెలుగు రాష్ట్రాలలో మహారాజా 20కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టింది.

Read Also:India-China: గుడ్‌న్యూస్.. త్వరలో భారత్-చైనా విమాన సర్వీసులు ప్రారంభం!

మహారాజ సినిమా విజయ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అయ్యిన సంగతి తెలిసిందే. మరి సాలిడ్ ఎమోషన్స్ తో రివెంజ్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ చిత్రం తమిళ్ సహా తెలుగులో కూడా మూసుకుని ఉన్న థియేటర్స్ తలుపులు తెరిచేలా చేసింది. అయితే ఇపుడు ఈ సినిమా ఇంట్రెస్టింగ్ గా చైనాలో థియేట్రికల్ రిలీజ్ సిద్ధం అయ్యింది. ఈ చిత్రాన్ని చైనాలో నవంబర్ 29న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఈ సినిమాను ఏకంగా 40 వేల థియేటర్లలో రిలీజ్ చేసేందుకు అక్కడి డిస్ట్రిబ్యూటర్లు ప్లాన్ చేస్తున్నారు. దీనికి తగ్గట్లుగా వారు ప్రణాళిక కూడా చేస్తున్నారు. ఇలా మహారాజ చిత్రం చైనా దేశంలో తన సత్తా చాటేందుకు సిద్ధమవుతుండడంతో విజయ్ సేతుపతి అభిమానులు ఈ సినిమా అక్కడి బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Show comments