Site icon NTV Telugu

Virosh Wedding : ఉదయ్‌పూర్‌లో విజయ్-రష్మిక పెళ్లికి.. హాజరయ్యే గెస్ట్ లిస్ట్ ?

Virosh Wedding

Virosh Wedding

గత కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న పెళ్లి వార్తలకు ఎట్టకేలకు తెరపడింది. ఎన్నో ఏళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట, తమ వివాహ బంధాన్ని అధికారికంగా ప్రకటిస్తూ అభిమానులకు తీపి కబురు అందించారు. ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వేదికగా వీరిద్దరూ ఒక్కటి కాబోతున్నారు. ఈ ప్రతిష్టాత్మక వివాహానికి సంబంధించిన వెడ్డింగ్ కార్డ్.. షెడ్యూల్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. అత్యంత సన్నిహితుల మధ్య వైభవంగా జరగనున్న ఈ వేడుకకు ఇండస్ట్రీ నుంచి ఎవరు హాజరవుతున్నారు? గెస్ట్ లిస్ట్ ఎంత? అనే ఆసక్తికర విశేషాలు ఇప్పుడు బయటకు వచ్చాయి.

Also Read : Vishwambhara: ఉగాదికి మెగాస్టార్ ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ ఫిక్స్.. సరికొత్త గ్లింప్స్‌తో వస్తున్న వశిష్ట!

ఇక సమాచారం ప్రకారం విజయ్, రష్మిక ఇప్పటికే తమ కుటుంబ సభ్యులతో కలిసి ఫిబ్రవరి 23నే ఉదయ్‌పూర్ చేరుకున్నారు. వీరి వివాహ వేడుకలు మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా సాగనున్నాయి. షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 24న హల్దీ, మెహందీ వేడుకలు, 25న సంగీత్ కార్యక్రమం ఉండనుంది. ఫిబ్రవరి 26న ఉదయం ముహూర్తానికి ఈ జంట పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఈ వివాహ వేడుకకు కేవలం 200 మంది అతిథులను మాత్రమే ఆహ్వానించినట్లు తెలుస్తోంది. అంటే ఇందులో విజయ్ రష్మిక కుటుంబాల నుంచి చెరో 100 మంది సభ్యులు ఈ వేడుకలో పాలుపంచుకోనున్నారు. అయితే, సినీ పరిశ్రమ నుంచి ముగ్గురు స్టార్ డైరెక్టర్లు ఈ వేడుకకు ప్రత్యేక అతిథులుగా హాజరవుతున్నట్లు సమాచారం. విజయ్‌కు ‘పెళ్లిచూపులు’తో లైఫ్ ఇచ్చిన తరుణ్ భాస్కర్, ‘అర్జున్ రెడ్డి’తో స్టార్‌డమ్ తెచ్చిన సందీప్ రెడ్డి వంగా.. అత్యంత సన్నిహితుడైన ‘కల్కి’ దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ జాబితాలో ఉన్నారు. అయితే నాగ్ అశ్విన్ ప్రస్తుతం ‘కల్కి 2’ షూటింగ్‌లో బిజీగా ఉండటంతో ఆయన హాజరుపై ఇంకా సందిగ్ధత నెలకొంది.

ఉదయ్‌పూర్‌లో జరిగే పెళ్లికి రాలేని ఇండస్ట్రీ మిత్రుల కోసం మార్చి 4వ తేదీన హైదరాబాద్‌లోని తాజ్ హోటల్‌లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్, కోలీవుడ్ నుంచి అగ్ర నటీనటులు, సాంకేతిక నిపుణులు హాజరుకానున్నారు. అలాగే మీడియా మిత్రుల కోసం ప్రత్యేకంగా మరో రోజు విందు ఏర్పాటు చేసి, వ్యక్తిగతంగా అందరినీ కలవాలని ఈ జంట నిర్ణయించుకుందట. మొత్తానికి ఫిబ్రవరి 26న ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఒక బ్యూటిఫుల్ వెడ్డింగ్ చాప్టర్ మొదలుకాబోతోంది.

Exit mobile version