Vijay Deverakonda: విజయ్ దేవరకొండ సరసన కృతిసనన్..

Vijay Deverakonda Kriti Sanon Movie,

Vijay Deverakonda Kriti Sanon Movie,

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అయితే ‘హాయ్ నాన్న’ ఫేమ్ శౌర్యువ్‌ దర్శకత్వంలో విజయ్ ఒక మైథలాజికల్ బ్యాక్‌డ్రాప్‌ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. వైరా ఎంటర్‌టైన్మెంట్స్‌ సంస్థ నిర్మించనున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. అయితే, ఈ సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్..

కృతీసనన్‌ను చిత్ర బృందం సంప్రదిస్తున్నట్లు ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో గట్టిగా వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ కాంబినేషన్‌కు సంబంధించి చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే దీనిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. కృతీసనన్ గతంలో మహేశ్‌బాబు ‘వన్‌ : నేనొక్కడినే’, ప్రభాస్‌ ‘ఆది పురుష్‌’, నాగచైతన్య ‘దోచెయ్‌’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. కానీ ఒక్క మూవీ కూడా హిట్ అవ్వలేదు. ఒకవేళ ఈ ప్రాజెక్టు ఓకే అయితే, విజయ్ దేవరకొండ – కృతీసనన్ జోడీ వెండితెరపై ఒక ఫ్రెష్ ఫీల్‌ను తీసుకురావడం ఖాయం. కాగా ప్రస్తుతం విజయ్ ‘రణబాలి’, ‘రౌడీ జనార్ధన’ సినిమాల షూటింగ్స్‌లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రాల షూటింగ్ ముగింపు దశకు చేరుకున్న తర్వాత శౌర్యువ్‌ దర్శకత్వంలో రాబోయే మైథలాజికల్ సినిమాను విజయ్ ఆరంభించే అవకాశం ఉంది