NTV Telugu Site icon

Family Star Trailer : ‘ఫ్యామిలీ స్టార్ ‘ ట్రైలర్ వచ్చేసింది.. అది మాత్రం హైలెట్ బాసూ..

Familystr

Familystr

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఫ్యామిలీ స్టార్ ‘. పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు.. వాసు వర్మ క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహారిస్తున్నారు.. ఇక ఈ సినిమా ఏప్రిల్ 5 పాన్ ఇండియా సినిమాగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజీర్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి..

సినిమా పై అంచనాలను రెట్టింపు చేశాయి..రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ వేగాన్నిపెంచేసిన మేకర్స్.. వరుస లిరికల్ సాంగ్స్ ను రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన రెండు సాంగ్స్ హైప్ ను క్రియేట్ చేశాయి.. ఇప్పుడు తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.. ఫ్యామిలీ విలువలను పెంచేలా అద్భుతంగా ఉంది ట్రైలర్.మిడిల్ క్లాస్ వాళ్ల ఆలోచనలు ఎలా ఉంటాయి.. ఫ్యామిలి ఎమోషన్స్, విజయ్ దేవరకొండ డైలాగులు ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్నాయి.. ప్రతి సీన్ లో విజయ్ డైలాగులు బాగా ఆకట్టుకుంటున్నాయి.. విజయ్ దేవరకొండ లుక్ ఈ సినిమాకు హైలెట్ గా నిలుస్తుందని ట్రైలర్ ను చూస్తుంటే తెలుస్తుంది..

ఇక ఈ సినిమాలో మిడిల్ క్లాస్ మ్యాన్‍గా విజయ్ దేవరకొండ కనిపించబోతున్నారు.. అలాగే మూవీలో రష్మిక మందన్న అతిధి పాత్రలో నటించగా, దివ్యాంశ కౌశిక్ ఒక ముఖ్యమైన పాత్రను పోషించింది. దిల్ రాజు ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఎమోషనల్ మూమెంట్స్‌తో కూడిన సాధారణ ఫ్యామిలీ డ్రామా అని ట్రైలర్ ను చూస్తుంటే తెలుస్తుంది.. ఈ సినిమాకు గోపి సుందర్ చక్కటి సంగీతాన్ని అందించారు..

Show comments