NTV Telugu Site icon

Family Star : టీవీలోకి వచ్చేస్తున్న విజయ్ దేవరకొండ ‘ది ఫ్యామిలీ స్టార్ ‘..

Family Star

Family Star

Family Star : రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ “ది ఫ్యామిలీ స్టార్ “..ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ పరశురామ్ తెరకెక్కించారు.ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఎంతో గ్రాండ్ గా నిర్మించారు.ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన క్యూట్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. గతంలో విజయ్ ,పరశురామ్ కాంబినేషన్ లో వచ్చిన ” గీతా గోవిందం ” సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది.ఈ సినిమాకు భారీగా కలెక్షన్స్ వచ్చాయి.అయితే ఈ హిట్ కాంబినేషన్ లో మరో మూవీ వస్తుండటంతో ఫ్యామిలీ స్టార్ సినిమాపై ప్రేక్షకులలో మంచి అంచనాలు ఏర్పడ్డాయి.ఫ్యామిలీ స్టార్ సినిమా ఏప్రిల్ 5 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి షో నుంచే నెగటివ్ టాక్ రావడంతో ఆ ప్రభావం ఈ సినిమా కలెక్షన్స్ పై పడ్డాయి.

Read Also :Devara : గోవాలో ‘దేవర’ నూతన షెడ్యూల్..

ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాకపోవడంతో విజయ్ దేవరకొండ కెరీర్ లో మరో ప్లాప్ మూవీ గా నిలిచింది. ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయిన మూడు వారాల్లోనే ఏప్రిల్ 26 వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కు వచ్చింది.అయితే ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా థియేటర్ ప్రేక్షకులను అంతగా మెప్పించలేదు.కానీ ఓటిటి ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది .ఓటిటిలో ఈ సినిమాకు భారీగా వ్యూస్ లభించాయి.దీనితో రెండు వారాలు నేషనల్ వైడ్ గా ఫ్యామిలీ స్టార్ మూవీ ప్రైమ్ వీడియోలో టాప్ లో ట్రెండ్ అయింది.ఓటిటిలో అదరగొట్టిన ఈ సినిమా టీవీ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తుంది.ఫ్యామిలీ స్టార్ మూవీ జూన్ 16 వ తేదీ ఆదివారం సాయంత్రం 6 గంటలకు స్టార్ మా టీవీలో టెలికాస్ట్ కానుంది.వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ అంటూ తాజాగా ఈ విషయాన్నీ స్టార్ మా వెల్లడించింది.

Show comments