NTV Telugu Site icon

VD 12 : ఎట్టకేలకు విజయ్ – గౌతమ్ .. రెడీ.. కెమెరా.. యాక్షన్

Vd12

Vd12

VD 12 : రౌడీస్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ ఆఖరి చిత్రం లైగర్ ఎంతటి డిజాస్టర్ గా నిలిచిందో తెలిసిందే. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన సినిమా అంచనాలన్నీ తలకిందులు చేసింది. ఆశగా ఎదురు చూసిన ఫ్యాన్స్ కు భారీ నిరాశే ఎదురైంది. విజయ్ కెరీర్లోనే ఈ సినిమా మర్చిపోలేని మచ్చగా మిగిలిపోతుంది. చాలా కాలం పాటు విజయ్ పూరి ఆ షాక్ నుంచి తేరుకోలేకపోయారు. నెమ్మదిగా అందులో నుంచి బయటకు వచ్చి విజయ్ తన సినిమాలపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే విజయ్ కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. ఆయ‌న క‌థానాయ‌కుడిగా నేష‌న‌ల్ అవార్డ్ విన్నింగ్ మూవీ జెర్సీ డైరెక్టర్ గౌత‌మ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ మూవీ తెరకెక్కబోతోంది. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌ నిర్మిస్తున్నారు. సితార సంస్థతో పాటు శ్రీకర స్టూడియోస్‌, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యాన‌ర్స్ కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగ‌మ‌వుతున్నాయి. సూర్యదేవర నాగ‌వంశీ, సాయి సౌజ‌న్య సినిమాను నిర్మించ‌బోతున్నారు.

Read Also: Agent 2 : ఏజెంట్ దెబ్బకు అయోమయంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్

లేటెస్ట్ టాలీవుడ్ సమాచారం ప్రకారం.. ఈ భారీ మూవీ ఓపెనింగ్ నేడు హైదరాబాద్ లో గ్రాండ్ గా జరుగనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీలో శ్రీలీల నటిస్తుండగా ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులను ప్రకటించాల్సి ఉంది. కాగా ఈ సినిమాకి సంబందించిన మరిన్ని అప్ డేట్స్ త్వరలో రానున్నాయి. గౌత‌మ్ తిన్ననూరి ఇప్పటి వ‌ర‌కు రెండు సినిమాల‌కు దర్శకత్వం వహించారు. మ‌ళ్ళీరావా, జెర్సీ.. ఈ రెండు చిత్రాల్లో జెర్సీ సినిమాకు జాతీయ స్థాయిలో గుర్తింపు ద‌క్కింది. త‌ర్వాత రామ్ చ‌ర‌ణ్‌తో గౌత‌మ్ సినిమా ఉంటుంద‌నే అనౌన్స్‌మెంట్ కూడా వ‌చ్చింది. అయితే ఏం జ‌రిగిందో ఏమో తెలియ‌దు కానీ.. ఆ ప్రాజెక్ట్ సైడ్‌కి వెళ్లిపోయింది. దీంతో గౌత‌మ్ తిన్ననూరి విజ‌య్ దేవ‌కొండ‌కు కథ చెప్పగానే నచ్చడంతో సినిమా పట్టాలెక్కింది.

Read Also: Rajinikanth Fans: రజనీకాంత్ ఫ్యాన్స్‌ భేటీ.. మంత్రి రోజాకు సీరియస్‌ వార్నింగ్‌..

Show comments