Raththam :విజయ్ ఆంటోనీ ‘రత్తం’ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోని హీరోగా నటించిన లేటేస్ట్ మూవీ ‘రత్తం’. డైరెక్టర్ సీఎస్ అముదన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ భారీ అంచనాల మధ్య అక్టోబర్ 6న థియేటర్లలో విడుదలైంది.క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందించిన ఈ సినిమా ప్రేక్షకుల నుండి మిక్డ్స్ టాక్ అందుకుంది. ఈ సినిమా లో విజయ్ ఆంటోని నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ శుక్రవారం అంటే నవంబర్ 3న నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ వెల్లడించారు. అయితే ఈ సినిమా కేవలం తమిళంలోనే విడుదల అవుతుందా..లేదా తెలుగులో కూడా వస్తుందా అన్న విషయంపై క్లారిటీ రాలేదు.
ఈ సినిమా లో మహిమ నంబియార్, నందితా శ్వేత, రమ్య నంబీశన్, మరియు నిజాల్గల్ రవి కీలకపాత్రలు పోషించారు.. ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ బ్యానర్‌పై కమల్ బోహ్రా, జి ధనంజయన్, ప్రదీప్ బి, పంకజ్ బోహ్రా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి కన్నన్ నారాయణన్ మ్యూజిక్ అందించారు.ఈ సినిమా కథ విషయానికి వస్తే..ఇందులో రంజిత్ కుమార్ అనే పరిశోధనాత్మక జర్నలిస్ట్ పాత్రను విజయ్ ఆంటోనీ పోషించాడు. అతడు చెన్నైలో తీవ్ర సంచలనం సృష్టించిన వరుస హత్యల వెనుక ఉన్న నింధితుడిని కనిపెట్టే ప్రయత్నం చేస్తాడు. ఈ హత్యల కారణంగా రాజకీయ దుమారం చెలరేగి కొందరు మంత్రుల రాజీనామాకు దారితీసిన పరిణామాలను చూపించారు. చెజియాన్ అనే వ్యక్తి ఒక మీడియా సంస్థ సంపాదకుడు. అతను ఆరాధించే సినీ నటుడి గురించి ప్రతికూలంగా పోస్ట్ చేసినందుకు ఒక మతోన్మాదుడు హత్య చేయబడ్డాడు. జర్నలిస్ట్ హత్యను లోతుగా పరిశోధిస్తున్నప్పుడు ఆ హత్య వెనక మరింత నెట్వర్క్ ఉందని రంజిత్ గ్రహిస్తాడు. అంతేకాకుండా హత్యలను అరికట్టడానికి అలాగే అక్రమ రాకెట్‌ను నాశనం చేయడానికి రంజిత్ కుమార్ చేసే ప్రయత్నమే ఈ సినిమా కథ..
Also Read
- Bill Gates: ‘ఏఐతో బిలియన్ల మరణాలు సంభవించవచ్చు’..
- Congress: మోడీ గెలిచిన వారణాసిలో రీపోలింగ్ నిర్వహించాలి.. యూపీ కాంగ్రెస్ చీఫ్ డిమాండ్..
- Virat Kohli: "ఆ ఓటమి నన్ను లోపలి నుంచి కుంగదీసింది".. విరాట్ కోహ్లీ ఎమోషనల్..
- CJP: కాక్రోచ్ పార్టీకి హిమంత మామ ట్రీట్మెంట్.. రాంకా అరెస్ట్, అభిజత్ దీప్కే ఆగ్రహం..
- Tags
- #Raththam
- OTT
- release
- Vijay Antony
తాజావార్తలు
-
CM Revanth Reddy : శ్వేతపత్రం విడుదల చేశాకే సిరిసిల్లలో అడుగుపెట్టాలి
-
LPU Students Protest: LPUలో స్టూడెంట్స్ రచ్చ.. రేప్ ఆరోపణలతో వర్సిటీలో విధ్వంసం..
-
Bill Gates: ‘ఏఐతో బిలియన్ల మరణాలు సంభవించవచ్చు’..
-
‘ఆడోళ్లు ఎక్స్ట్రీమ్కు వెళ్తే ఏ మగాడూ తట్టుకోలేడు’ విమెన్ పవర్‌పై Srikanth Odela మైండ్ బ్లోయింగ్ కామెంట్స్!
-
Congress: మోడీ గెలిచిన వారణాసిలో రీపోలింగ్ నిర్వహించాలి.. యూపీ కాంగ్రెస్ చీఫ్ డిమాండ్..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?