Viral : కరోనా మహమ్మారి పుణ్యమాని ఈ రోజుల్లో అందరికీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగింది. మంచి శరీరాన్ని పొందేందుకు చాలా మంది జిమ్‌లో చెమటోడ్చుతున్నారు. వివిధ రకాల ఆహారాలు, ప్రోటీన్లను తినడంపై దృష్టి పెడుతున్నారు. ఈ క్రమంలో కేవలం 12 ఏళ్ల బాలుడు వ్యాయామం చేసి కండలు తిరిగిన శరీరాన్ని నిర్మించుకున్నాడు. సోషల్ మీడియాలో అతని వీడియోకు విపరీతమైన లైక్స్ వస్తున్నాయి. ఈ పిల్లాడు జిమ్‌లో పెద్ద వాళ్లను కొడుతున్నాడు. 12 ఏళ్ల బ్రెజిలియన్ కుర్రాడికి వ్యాయామం పట్ల ఉన్న ప్రేమ పెద్దల దృష్టిని కూడా ఆకర్షించింది.
బ్రెజిల్‌కు చెందిన 12 ఏళ్ల కౌజిన్హో నెటో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించాడు. తాను కసరత్తులు చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇంత చిన్న వయస్సులో ఉన్న ఈ చిన్న పిల్లవాడి కండరాలు చూసి ఆశ్చర్యపోతున్నారు. ఈ కుర్రాడు వర్కవుట్ చేస్తున్న వీడియోలను చూసి పెద్దలు కూడా ఖచ్చితంగా వ్యాయామం చేయాలని, అతనిలానే తమ శరీరాన్ని నిర్మించుకోవాలని అనుకుంటారు.
Read Also: పాదాలను నానబెట్టడం వల్ల కలిగే లాభాలు ఎన్ని ఉన్నాయో తెలుసా మీకు..?
నెటో బ్రెజిల్‌లోని సాల్వడార్ నివాసి. అతని దినచర్య ఉదయం ఐదున్నర గంటలకు ప్రారంభమవుతుంది. రోజూ ఉదయం ఐదు కిలోమీటర్లు పరిగెత్తుతాడు. ఆ తర్వాత ఫుష్ అప్స్ చేసి స్కూల్ కి వెళ్తాడు. స్కూల్ నుంచి వచ్చాక కాస్త రిలాక్స్ అయ్యి హోం వర్క్ చేస్తాడు. అతను నిద్రపోయే ముందు మళ్లీ రోజులో రెండో సారి రెండు నుండి రెండున్నర గంటలు వ్యాయామం చేస్తాడు.
12 ఏళ్ల నెటో 91 కిలోల కంటే ఎక్కువ బరువును ఎత్తగలడు. ఇది అతడి బరువు కంటే మూడు రెట్లు ఎక్కువ. ఈ అబ్బాయికి ఇన్‌స్టాగ్రామ్‌లో 2 లక్షల 69 మంది ఫాలోవర్లు ఉన్నారు. అందులో డెడ్‌లిఫ్ట్‌లు, స్క్వాట్స్, బెంచ్ ప్రెస్, బైసెప్స్ కర్ల్స్ వంటి వ్యాయామాలు చేస్తూ కనిపించాడు. 2021 సంవత్సరంలో నెటోను అతని తండ్రి జిమ్‌కి తీసుకెళ్లారు. ఆ తర్వాత బాడీ బిల్డింగ్‌పై ఆసక్తి పెంచుకున్నాడు. పదిహేను రోజుల్లో వ్యాయామం నేర్చుకున్నాడు. సాల్వడార్‌లో జరిగిన వెయిట్‌లిఫ్టింగ్ పోటీలో పాల్గొన్నాడు.
