NTV Telugu Site icon

Viral Video : కోర్టులో జుట్టు జుట్టు పట్టుకుని బీభత్సంగా కొట్టుకున్న జడ్జి, లాయర్

New Project (34)

New Project (34)

Viral Video : న్యాయవాదులు, పోలీసులతో కిక్కిరిసిన కోర్టు ఆవరణలో నల్లకోటు ధరించిన ఇద్దరు మహిళలు జుట్టు జుట్టు పట్టుకుని కొట్టుకున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మహారాష్ట్రలోని ఓ కోర్టులో మహిళా జడ్జి, లాయర్‌ను చితక్కొట్టేసుకుంటున్నట్టుగా ఉన్న ఆ వీడియో విపరీతంగా షేర్ అవుతుంది. వాస్తవానికి ఈ వీడియో 2022 నవంబర్ నాటిది అయినా ఇప్పటికి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఎదుటివారి సమస్యలకు పరిష్కారాలు చూపాల్సిన వారే సమస్యగా తయారయ్యారని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. వీరిద్దరూ కొట్లాడుకోవడం నిజమే అయినా.. ‘ఫ్యాక్ట్ చెక్’లో మరో వాస్తవం వెలుగులోకి వచ్చింది.

ఆ వీడియోలో కనిపిస్తున్నది మహారాష్ట్ర కోర్టు కాదు. ఇది ఉత్తరప్రదేశ్‌లోని కాస్‌గంజ్ కుటుంబ న్యాయస్థానం, అక్కడ గొడవపడుతున్న వారిలో ఒకరు న్యాయమూర్తి, మరొకరు జడ్జి కాదు. ఇద్దరూ న్యాయవాదులే. ఓ జంట తరఫున వీరిద్దరూ వాద ప్రతివాదాలు వినిపిస్తున్నారు. ఈ క్రమంలో కోర్టు బయట వారిద్దరి వారి మధ్య మాటామాటా పెరిగి గొడవకు దారితీసింది. ఆపై ఇద్దరూ కలిసి ఒకరినొకరు కొట్టుకున్నారు. వారిద్దరూ జుట్టు పట్టుకుని కొట్టుకుంటుండగా కొందరు విడదీసేందుకు ప్రయత్నించగా, మరికొందరు వీడియోలు తీస్తూ ఎంజాయ్ చేశారు. చివరకు ఓ మహిళా పోలీసు జోక్యంతో గొడవ సద్దుమణిగింది.

Show comments