Site icon NTV Telugu

viral video: అంకుల్ నీ హెడ్ పైన జుట్టు పోయింది కానీ.. నీలో జోష్ తగ్గలేదు

Dance

Dance

viral video: సోషల్ మీడియాలో చాలా డ్యాన్స్ వీడియోలు వైరల్ అవుతాయి. అలానే ఓ అంకుల్ డ్యాన్స్ వేసిన వీడియో ప్రస్తుతం బాగా ట్రెండింగ్ లో ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని మెరైన్ డ్రైవ్‌లో ఓ వ్యక్తి చేసిన డ్యాన్స్ వీడియో సోష‌ల్ మీడియాలో ప్రస్తుతం తెగ షేర్ అవుతోంది. ఫ్లట్టర్ షట్టర్ అనే పేజ్ ద్వారా ఈ వీడియోను ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేయ‌గా ఇప్పటివరకు ఏకంగా 20 ల‌క్షల వ్యూస్ ల‌భించాయి. ఈ వీడియోలో ల‌త్‌ల‌గ్ గయి సాంగ్‌కు వృత్తిరీత్యా చార్టర్డ్ అకౌంటెంట్ అయిన అభిజిత్ సాహ స్టైలిష్ డ్యాన్స్ మూమెంట్స్‌తో దుమ్ము దులిపేశాడు. అత‌డితో పాటు ప‌లువురు డ్యాన్స్ చేసినా అభిజిత్ ఫుల్ జోష్ లో పూర్తి ఎన‌ర్జీతో స్టెప్పులేయ‌డం అంద‌రినీ ఆక‌ర్షించింది. జీవితంలో ఈ మాత్రం కాన్ఫిడెన్స్ ఉండాల‌ని వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. సోష‌ల్ మీడియా యూజ‌ర్లు అభిజిత్ అంకిత భావాన్ని మెచ్చుకున్నారు. అత‌డి స్ఫూర్తి చాలా గొప్పదని కామెంట్ చేశారు. అభిజిత్ చాలా గొప్పగా డ్యాన్స్ చేశాడ‌ని, ఎంతో కాన్ఫిడెంట్‌తో మూమెంట్స్ ఇచ్చాడ‌ని ఓ యూజ‌ర్ కామెంట్ చేశారు.

Exit mobile version