Venkatesh: సుప్రియ కోసం కాదు.. ఆయన కోసమే ఈవెంట్‌కు వచ్చా.. విక్టరీ వెంకటేష్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Venkatesh: అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన మోస్ట్ ఎవైటెడ్ ఫిల్మ్ ‘డెకాయిట్’ విడుదలకు సిద్ధమైంది. ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఈ రోజు ఘనంగా నిర్వహించారు మేకర్స్. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన విక్టరీ వెంకటేష్ చిత్ర యూనిట్‌ను ఉత్సాహపరుస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ.. నిజంగా ఈ ఈవెంట్‌కు సుప్రియ కోసం రాలేదు, నాకు ఇష్టమైన సురేంద్ర మామయ్య కోసం వచ్చాను అని అన్నారు. అడివి శేష్‌ను తాను ‘పంజా’ సినిమా నుంచే గమనిస్తున్నానని చెప్పారు. అప్పుడే అతను ఒక మంచి నటుడు అవుతాడని తనకు తెలుసని, ప్రతి సినిమాతో అతను తనను తాను నిరూపించుకుంటూ వస్తున్నాడని ప్రశంసించారు. శేష్ మరిన్ని బ్లాక్‌బస్టర్లు సాధించాలని, ‘డకాయిట్’ కచ్చితంగా పెద్ద హిట్ అవుతుందని వెంకటేష్ ధీమా వ్యక్తం చేశారు.
READ ALSO: Dacoit Movie: ఇక నా వల్ల కాదు, తెలుగు సినిమా చేయను.. డైరెక్టర్‌కు మృణాల్ ఠాకూర్ ఫోన్!
Also Read
- Abhijeet Dipke: అభిజిత్ దీప్కేకు ఊరట.. షరతులతో బెయిల్..!
- Gurugram Techie Couple: ‘‘ మేం ఈ లోకాన్ని విడిచి వెళ్తున్నాం’’.. టెక్కీ దంపతుల మరణం..
- Kiren Rijiju: ‘‘యాంటీ-ఇండియా ఎవరో తెలిసిపోయింది’’.. అసదుద్దీన్ ఓవైసీపై కేంద్రమంత్రి ప్రశంసలు..
- Air India: సౌదీ అరేబియాకు విమానాలు రద్దు.. జెడ్డా, రియాద్, దమ్మామ్ సర్వీసులు నిలిపివేత..
హీరోయిన్ మృణాల్ ఠాకూర్ గురించి మాట్లాడుతూ.. ఆమె ముఖంలో అద్భుతమైన హావభావాలు ఉంటాయని కొనియాడారు. ఆమె ఈ సినిమాలో భాగమవ్వడం చిత్రానికి పెద్ద ప్లస్ అని, ఆమె నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని వెంకటేష్ పేర్కొన్నారు. ఈ సినిమాను ఎంతో ప్యాషన్‌తో నిర్మించిన సుప్రియ యార్లగడ్డను వెంకటేష్ ప్రత్యేకంగా అభినందించారు. ఒక మంచి టీమ్‌తో డిసిప్లిన్డ్‌గా ఈ సినిమాను రూపొందించారని, ప్రేక్షకులకు ఒక మంచి అనుభూతిని ఇచ్చే సినిమాగా ‘డెకాయిట్’ నిలుస్తుందని చెప్పారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో, సుప్రియ యార్లగడ్డ నిర్మించిన ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. అడివి శేష్ కెరీర్‌లో మరో వైవిధ్యమైన చిత్రంగా ‘డెకాయిట్’ నిలుస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.
READ ALSO: Sai Marthand: అడివి శేష్‌తో ‘లిటిల్ హార్ట్స్’ దర్శకుడి నెక్స్ట్ మూవీ.. అఫీషియల్ అప్‌డేట్ వచ్చేసింది!
తాజావార్తలు
-
Abhijeet Dipke: అభిజిత్ దీప్కేకు ఊరట.. షరతులతో బెయిల్..!
-
Bela Bajaria: వెయ్యి మందికి ఉద్వాసన.. ఇప్పుడు టాప్ బాస్‌పై వేటు! నెట్‌ఫ్లిక్స్‌లో ఏం జరుగుతోంది?
-
Gurugram Techie Couple: ‘‘ మేం ఈ లోకాన్ని విడిచి వెళ్తున్నాం’’.. టెక్కీ దంపతుల మరణం..
-
TDP Candidates 2nd List: మున్సిపల్ ఎన్నికలకు టీడీపీ రెండో జాబితా విడుదల.. 22 మంది అభ్యర్థులు వీరే!
-
Kiren Rijiju: ‘‘యాంటీ-ఇండియా ఎవరో తెలిసిపోయింది’’.. అసదుద్దీన్ ఓవైసీపై కేంద్రమంత్రి ప్రశంసలు..
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!