Site icon NTV Telugu

Fake ID Card: నకిలీ గుర్తింపు కార్డుతో అక్రమ వసూళ్లు చేస్తున్న కేటుగాడు..!

New Project (17)

New Project (17)

Fake ID Card: గత కొద్దిరోజులుగా ఒక కొరియోగ్రాఫర్‌ నకిలీ పోలీస్‌ అవతారమెత్తి.., స్పాలు, మసాజ్‌ సెంటర్‌ లను లక్ష్యంగా చేసుకుని అక్రమ వసూళ్లకు తెరలేపి చివరికి కటకటాలపాలయ్యాడు. ఇందుకు సంబంధించి వివరాలు పరిశీలిస్తే… పోలీస్‌ ఇంటెలిజెన్స్‌ డిటెక్టివ్‌ ఆఫీసర్‌ అనే పేరుతో ఓ నకిలీ గుర్తింపుకార్డు తయారు చేసుకుని కొందరిని బెదిరిస్తూ వసూళ్లకు పాల్పడుతున్న వ్యక్తిని తాజాగా మాదాపూర్‌ జోన్‌ ఎస్‌ఓటీ పోలీసులు అతనిని అరెస్టు చేశారు.

Read Also:Telangana Student: అమెరికాలో జెట్‌స్కీ ప్రమాదం.. తెలంగాణ విద్యార్థి మృతి!

వృత్తిరీత్యా నృత్య దర్శకుడైన గుడిమల్కాపూర్‌ ప్రాంతానికి చెందిన మారికొండ సాయి కిరణ్‌ తేజ (30) అనే వ్యక్తి క్రైం ఇంటెలిజెన్స్‌ డిటెక్టివ్‌ ఆఫీసర్ అనే పేరుతో ఓ నకిలీ గుర్తింపు కార్డును తయారు చేశాడు ఘనుడు. ఈయన ఆన్‌ లైన్‌ లో మాదాపూర్‌, రాయదుర్గం తోపాటు వివిధ ప్రాంతాల్లోని అనేక స్పా, మసాజ్‌ సెంటర్ల ఫోన్‌ నంబర్లను సేకరించి ఫోన్‌ చేసి ముందుగా వారి సేవలపై ఆరా తీశాడు.

Read Also:NBK 109 : బాలయ్య మూవీలో మరో మలయాళ హీరో.. ఎవరంటే..?

ఆ తరువాత అతను ఆ ప్రాంతాలకి వెళ్లి గుర్తింపు కార్డులను చూపించి వారిని బెదిరించి డబ్బులు వసూలు చేసాడు. ఇందులో భాగంగానే రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధి లోని స్టార్‌ వెల్‌సెన్‌ స్పా అండ్‌ ఫ్యామిలీ సెలూన్‌ లో పనిచేస్తున్న సిబ్బందిని బెదిరించి ఏకంగా వారినుండి రూ.10వేల వరకు వసూలు చేశాడు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని అతడిని స్పాట్ లో పట్టుకున్నారు. పోలీసులు అతడిని విచారించగా అంతకు ముందు రిలాక్స్‌ బ్యూటీ అండ్‌ స్పా నుంచి కూడా రూ.5 వేల వరకు వసూలు చేసినట్లు వెల్లడించాడు.ఆపై పోలీసులు నిందితుడి నుంచి రూ.10వేల డబ్బులు, ద్విచక్రవాహనం, సెల్‌ఫోన్‌ స్వాధీనం చేసుకొని., నేరస్థుడ్ని తదుపరి విచారణ కోసం కేసును రాయదుర్గం పోలీసులకు అప్పగించారు.

Exit mobile version