Site icon NTV Telugu

Vichithra :చిన్న సినిమా.. పెద్ద ఎమోషన్! ఆకట్టుకుంటున్న ‘విచిత్ర’ మూవీ అప్‌డేట్స్!

Vichithra

Vichithra

ప్రపంచంలో అమ్మ ప్రేమకు మించినది ఏదీ లేదని చాటిచెప్పేలా, హారర్ త్రిల్లర్ జానర్‌లో తెరకెక్కిన విభిన్న చిత్రం ‘విచిత్ర’. జ్యోతి పూర్వాజ్ ప్రధాన పాత్రలో నటించగా.. రవి, శ్రేయ తివారి హీరో హీరోయిన్లుగా పరిచయమవుతున్నారు. సిస్ ఫిలిమ్స్ బ్యానర్‌పై సైఫుద్దీన్ మాలిక్ స్వయంగా నిర్మించి దర్శకత్వం వహించిన ఈ చిత్రం, అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని మే 22, 2026న గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ప్రతి ఆడతల్లి గుండెను హత్తుకునేలా, సెంటిమెంట్ ప్రధానంగా సాగే ఈ సినిమాను కుటుంబ సభ్యులతో కలిసి ఎంజాయ్ చేయవచ్చని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

Also Read : Raghavendra Rao: శ్రీదేవి మరణంపై రాఘవేంద్రరావు సెన్సేషనల్ కామెంట్స్!

ఈ సందర్భంగా దర్శక నిర్మాత సైఫుద్దీన్ మాలిక్ మాట్లాడుతూ.. ‘ప్రపంచం మొత్తం దూరమైనా మనకు తోడుగా ఉండేది అమ్మ ప్రేమే. అదే పాయింట్‌తో ఈ ‘విచిత్ర’ను రూపొందించాం. చిత్ర పాడిన తల్లి సెంటిమెంట్ సాంగ్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తుంది. మ్యూజిక్ పరంగా ప్రతి పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సెన్సార్ పనులు కూడా పూర్తయ్యాయి, చిన్న సినిమా అని చూడకుండా మీడియా సోదరులు సపోర్ట్ చేసి మా చిత్రాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను’ అని తెలిపారు. రవి ప్రకాష్, సూర్య, ఛత్రపతి శేఖర్ వంటి అనుభవం ఉన్న నటులతో పాటు జబర్దస్త్ టీమ్ కూడా ఈ సినిమాలో నటించడం విశేషం.

Exit mobile version