NTV Telugu Site icon

SVC59 : కత్తి నేనే, నెత్తురు నాదే, యుద్ధం నాతోనే.. దేవరకొండ సినిమా అప్డేట్ వచ్చేసింది..

Whatsapp Image 2024 05 09 At 9.22.34 Am

Whatsapp Image 2024 05 09 At 9.22.34 Am

రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.ఈ హీరో నటించిన లేటెస్ట్ మూవీ ‘ఫ్యామిలీ స్టార్’.స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించిన ఈ మూవీ భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.కానీ ఈ సినిమాకు విడుదల అయిన మొదటి షో నుంచే నెగటివ్ టాక్ వచ్చింది.దీనితో నెగటివ్ టాక్ ఎఫెక్ట్ ఈ సినిమా కలెక్షన్స్ పై పడటంతో ఈసినిమా కమర్షియల్ గా విజయం సాధించలేదు.అయితే రీసెంట్ గా ఓటిటిలోకి వచ్చిన ఈ మూవీ అదిరిపోయే వ్యూస్ తో దూసుకుపోతుంది.ప్రస్తుతం విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ స్పై పీరియాడిక్ యాక్షన్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో వుంది.తాజాగా విజయ్ దేవరకొండ తన తరువాత సినిమాను ప్రకటించారు.మరోసారి దిల్ రాజు నిర్మాణంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో విజయ్ సినిమా చేస్తున్నాడు. రాజావారు రాణిగారు సినిమా దర్శకుడు రవి కిరణ్ కోలా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

రీసెంట్ ఈ సినిమాను చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. రూరల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా ఉండనుందని వారు తెలిపారు.అయితే విజయ్ దేవరకొండ తో హిట్టు ఫ్లాప్ తో సంబంధం లేకుండా మరో సినిమా చేస్తానని దిల్ రాజు తెలిపారు.ఆ మాటను నిలబెట్టుకుంటూ కేవలం ఒక్క సినిమా అనుభవం వున్నా రవి కిరణ్ కోలాకు అవకాశం ఇచ్చి అందరిని ఆశ్చర్య పరిచారు.ఇదిలా ఉంటే నేడు విజయ్ దేవరకొండ పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ నుంచి స్పెషల్ అప్డేట్ ఇవ్వనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.చెప్పినట్లుగానే మేకర్స్ ఒక పవర్ ఫుల్ పోస్టర్ రిలీజ్ చేసారు.ఈ పోస్టర్ లో కత్తి నేనే..నెత్తురు నాడే ..యుద్ధం నాతోనే ..అంటూ కత్తి పట్టుకున్న లుక్ అదిరిపోయింది..ఈ సారి పక్కా మాస్ కథతో విజయ్ సినిమా వుండనుందని ఈ పోస్టర్ చూస్తేనే తెలుస్తుంది.. సినిమా దిల్ రాజు బ్యానర్ లో 59 వ సినిమాగా రానుంది.ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది .