NTV Telugu Site icon

Bajrang Dal – VHP : రేపే ప్రేమికుల దినోత్సవం.. భజరంగ్ దళ్, వీహెచ్‌పీ కీలక ప్రకటన..

Vhp

Vhp

ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 14 న ప్రేమికుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ పాశ్చాత్య సంస్కృతి అమెరికా, కెనడా, మెక్సికో, యునైటేడ్‌ కింగ్‌డమ్, ఆస్ట్రేలియా, భారత్, ఇటలీ, డెన్మార్క్, జపాన్‌తో పాటు భారత దేశానికి కూడా పాకింది. పాశ్చాత్య దేశాల ప్రభావంగా భావించే వాలెంటైన్స్ డే వేడుకలు భారతదేశంలో వ్యతిరేకిస్తున్నారు. ఈ ప్రేమికుల దినోత్సవాన్ని వ్యతిరేకించే వారిలో విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ ముందుంటాయి. రేపు ప్రేమికులకు భజరంగ్ దళ్ భయం పట్టుకుంటుంది. యువత పార్కులు, పబ్‌లు తదితర ప్రదేశాలకు వెళ్లాలంటే భయపడతారు.

READ MORE: YSRCP: ఏపీ డీజీపీని కలవడానికి వెళ్లిన వైసీపీ బృందం.. సీఎంతో హరీష్ కుమార్ గుప్తా భేటీ!

ఇదిలా ఉండగా.. ప్రేమికుల దినోత్సవం నేపథ్యంలో విశ్వహిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర ప్రచార ప్రముక్ పగుడాకుల బాలస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. పుల్వామా వీరమరణం పొందిన జవాన్ల ఆత్మకు శాంతి చేకూరేలా కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి 14 అంటే కేవలం వాలెంటెన్స్ డే మాత్రమే కాదని.. భారతదేశ రక్షణలో వీరమరణం పొందిన పుల్వామా అమరవీరుల సంస్మరణ దినం అని గుర్తు చేస్తోందన్నారు. దేశ రక్షణలో రాజీలేని పోరాటం చేస్తూ.. వీరమరణం పొందిన అమరులను స్మరించే దినంగా ఫిబ్రవరి 14న నిర్వహించుకోవాలని విజ్ఞప్తి చేశారు. విదేశీ ముష్కరుల చేతిలో వీరమరణం పొందిన వీర జవాన్ల ఆశయ సాధన కోసం.. ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకొని భరతమాత సేవలో తరించాలన్నారు. ప్రేమ ముసుగులో విస్తృంకల చేష్టలకు పాల్పడుతున్న యువత కళ్ళు తెరిచి.. బుద్ధితో వ్యవహరించాలని సూచించారు.

READ MORE: Donald Trump: ‘‘ టుడే ఈజ్ ద బిగ్ వన్’’.. సుంకాలపై ట్రంప్ సంచలన ప్రకటన..