NTV Telugu Site icon

Vettaiyan : రజినీకాంత్ ‘వేట్టయన్’ టికెట్ రేట్ల తగ్గింపు!

Vettaiyan Collections

Vettaiyan Collections

Vettaiyan The Hunter special ticket prices from October 18th: సూప‌ర్‌స్టార్ రజినీకాంత్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన చిత్రం ‘వేట్టయన్- ద హంట‌ర్‌’ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ అందరికీ తెలిసిందే. టి.జె.జ్ఞాన‌వేల్ ద‌ర్శ‌క‌త్వం వహించిన ఈ సినిమాను ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ నిర్మించింది. సుభాస్క‌ర‌న్ నిర్మాతగా వ్యవహరించారు. ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 10న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. ఏసియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి దిల్ రాజు ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేశారు. సీడెడ్ ఏరియాలో శ్రీ లక్ష్మీ మూవీస్ రిలీజ్ చేసింది. గ్లోబల్ గా అన్ని ఏరియాల్లో విజయవంతంగా ప్రదర్శించబడుతూ రికార్డులు క్రియేట్ చేస్తుంది.

Vettaiyan : వేట్టయన్ చేయనున్న నాని .. అసలు విషయం చెప్పేసిన డైరెక్టర్

ఇక ఈ దసరా సెలవులు ముగియడంతో అందరికీ అందుబాటులో ఉండే విధంగా తెలంగాణలో ఈ మూవీ టికెట్ రేట్లను తగ్గించారు. మల్టీప్లెక్సుల్లో రూ. 200, సిటీ సింగిల్ స్క్రీన్‌లలో రూ. 150, డిస్ట్రిక్ట్ సింగిల్ థియేటర్లలో రూ. 110 గా టికెట్ రేట్లు ఫిక్స్ చేశారు. ఈ రేట్లు అక్టోబర్ 18 నుంచి అందుబాటులోకి రానున్నాయి. దీంతో మరింత కలెక్షన్లు పెరిగేలా కనిపిస్తున్నాయి. వేట్టయన్ మూవీకి ఇప్పుడు ఆక్యుపెన్సీ పెరిగేట్టు కనిపిస్తుంది. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, మంజు వారియర్, ఫాహద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, రితికా సింగ్, దుషారా విజయన్ నటన ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. ప్రతి యాక్టర్ కూడా తన ఎనర్జిటిక్ పర్ఫార్‌మెన్స్ తో ఆకట్టుకున్నాడు. అనిరుధ్ అందించిన సంగీతం ఈ సినిమా విజయంలో కీలకంగా మారింది.

లైకా ప్రొడక్షన్స్‌కు చెందిన GKM తమిళకుమారన్, రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్‌పై M షెన్‌బాగమూర్తి ఈ చిత్రాన్ని పంపిణీ చేస్తున్నారు. న్యాయం, అధికారం, ఎన్‌కౌంటర్ హత్య, అవినీతి విద్యా వ్యవస్థ ఇతివృత్తాలను ఈ సినిమాలో ఎంతో పవర్ ఫుల్ గా చూపించారు. వెట్టయన్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఇప్పటికే ₹240 కోట్లు అధిగమించిన సంగతి తెలిసిందే. ఇక తెలంగాణలో టికెట్ రేట్లు తగ్గించడంతో మరింత వసూళ్లు పెరిగే అవకాశం ఉంది.