NTV Telugu Site icon

Venugopala Krishna: ప్యాకేజీ కోసమే పొత్తులు…. పవన్ ని నమ్మితే అంతే

Minister Venugopala Krishna

Minister Venugopala Krishna

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ హాట్ కామెంట్లు చేశారు. పవన్ ప్రజల్లో తిరిగి వాస్తవం తెలుసుకుని మాట్లాడినట్టు ఉంది. పవన్ కళ్యాణ్ ఒక అపరిపక్వ నాయకుడుగా మిగులుతాడు. పవన్ స్పెషల్ ప్యాకేజీ కోసం పొత్తులు పెట్టుకుంటాడు.. ఎవరి ఎజెండాను పవన్ అమలు పరచాలనుకుంటున్నాడు. జనసైనికుల ఆశల మీద పవన్ నీళ్ళు చల్లాడన్నారు మంత్రి వేణుగోపాల్. పవన్ ను నమ్మిన వాళ్ళని దగా చేసాడు. చంద్రబాబు ను బార్ గెయిన్ చేయడానికి పనికొస్తుంది పవన్ బలం పెరిగిందని చెప్పడం. పవన్ వాస్తవం ఒప్పుకుని తప్పుకుని చంద్రబాబు కు అప్పగిస్తున్నట్టు కనిపించిందన్నారు.

Read Also:Karnataka Election Results Live Updates: మ్యాజిక్ ఫిగర్ దాటిన కాంగ్రెస్.. ఎమ్మెల్యేలందరూ బెంగళూరు రావాలని పిలుపు

పవన్ చేసిన పనితో 2014-19 లో ప్రజలు నష్టపోయారని పవన్ ఆత్మసాక్షికి తెలియాలి. 2014-19 లో జరిగిన తప్పుల్లో పవన్ వాటాదారుడు. ప్రజలు, జగన్ పొత్తులను నమ్మలేదు… రైతుల దగ్గరకు వెళ్ళి కొంగజపం చేస్తున్నారు. ప్రకృతి వలన వచ్చిన కష్టాలను వికృతంగా చూపించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. పవన్ స్వతంత్రంగా గెలవలేడు.. ఏ లక్ష్యాలతో పవన్ కు జనసైనికులు మద్దతిచ్చారో అది చేయలేనని చెప్పేశాడన్నారు మంత్రి వేణుగోపాల్.

Read Also: ED Notices: చీకోటికి తప్పని చిక్కులు.. పన్ను చెల్లించనందుకు ఈడీ నోటీసులు

Show comments