విక్టరి వెంకటేష్ హీరోగా సెన్సేషనల్ త్రివ్రిక్రమ్ దర్శకత్వంలో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. సంక్రాంతికి వస్తున్నాం సూపర్ సక్సెస్ తో జోష్ మీదున్న వెంకి ఇప్పుడు త్రివిక్రమ్ తో చేతులు కలిపాడు. గతంలో వెంకీ కెరీర్ లో సూపర్ హిట్ సినిమాలైనా నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరిలకు త్రివిక్రమ్ మాటల రచయితగా పని చేసాడు. ఇప్పుడు ఏకంగా వెంకీని డైరెక్ట్ చేస్తున్నాడు త్రివిక్రమ్. ఎప్పటినుండో వెంకీ, త్రివిక్రమ్ కాంబోలో సినిమా రావాలనుకున్న ఫ్యాన్స్ కోరిక నెరవేరింది.
Also Read : Day 2 : రజినీకాంత్ ‘కూలీ’ని దాటేసిన ఎన్టీఆర్ ‘వార్ 2’
అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎమోటిన్స్ తో పాటు త్రివిక్రమ్ స్టయిల్ ఆఫ్ కామెడీ, పంచ్ లతో సాగే కథ, కథానాలతో ఈ సినిమా తెరకెక్కబోతునట్టు తెలుస్తోంది. కాగా నేడు ఈ వెంకిత్రివిక్రమ్ సినిమాకు అధికారకంగా స్టార్ట్ చేసారు. ఈ రోజు ఉదయం రామానాయుడు స్టూడియోలో వెంకీ, త్రివిక్రమ్, సురేష్ బాబు, నాగవంశీ, చినబాబు సమక్షంలో పూజ కార్యక్రమాలు నిర్వహియించారు. ఈ సినిమాను హారిక హాసిని బ్యానర్ పై సూర్యదేవర చినబాబు నిర్మిస్తున్నారు. అలాగే ఈ సినిమాకు వెంకటరమణ అనే టైటిల్ కూడా పరిశీలనలో ఉందిని తెలుస్తోంది. త్వరలోనే సినిమా రెగ్యులర్ షూటింగ్ ను స్టార్ట్ చేయబోతున్నట్టు మేకర్స్ తెలిపారు. అలాగే వెంకితో సినిమాను చక చక ఫినిష్ చేసి వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా రిలీజ్ చేయాలని భావిస్తున్నారు మేకర్స్. వెంకీ, త్రివిక్రమ్ నుండి ఆశించే క్లీన్ కామెడీతో రాబోతున్న ఈ సినిమాతో ఎలాంటి హంగామా సృష్టిస్తారో చూడాలి. హీరోయిన్ తో పాటు ఇతర టెక్నిషియన్స్ వివరాలు త్వరలో తెలియజేయనున్నారు.
