వెంకీ మామ నుంచి సినిమా వస్తుందంటే చాలు.. అది పక్కా ఫ్యామిలీ పండగే! ఇక మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తోడైతే ఆ మ్యాజిక్కే వేరు. వీరిద్దరి కాంబోలో వస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆదర్శ కుటుంబం’ గురించి ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’లో నటిస్తున్న తెలుగు అందం పూజిత పొన్నాడ ఒక కీలక పాత్రలో కనిపించబోతుందట. కేవలం సోలో రోల్ మాత్రమే కాకుండా, ఈ సినిమాలో మరో ఇంట్రెస్టింగ్ యాక్టర్ నారా రోహిత్ కు జోడీగా పూజిత కనిపించనుందని టాక్. త్రివిక్రమ్ సినిమాల్లో సపోర్టింగ్ క్యారెక్టర్లకు కూడా మంచి ఇంపార్టెన్స్ ఉంటుంది కాబట్టి, పూజితకు ఇది పెద్ద ప్లస్ అయ్యేలా ఉంది.
ఇక శ్రీనిధి శెట్టి మెయిన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ సైలెంట్‌గా జరుగుతోంది. సమ్మర్ రిలీజ్ రేస్ నుంచి ఈ సినిమా తప్పుకున్నా, అవుట్ పుట్ విషయంలో మాత్రం త్రివిక్రమ్ ఎక్కడా కాంప్రమైజ్ అవ్వడం లేదట. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే.. మొదట హర్షవర్ధన్ రామేశ్వర్ పేరు వినిపించినా, ఇప్పుడు ఆ ప్లేస్ లోకి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఎంట్రీ ఇచ్చాడు. హారికా హాసిని ఎంటర్‌టైన్‌మెంట్స్ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ ‘ఆదర్శ కుటుంబం’ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. అటు వెంకీ మామ కామెడీ టైమింగ్, ఇటు త్రివిక్రమ్ పంచ్ డైలాగులు తోడైతే ఫ్యాన్స్‌కి పూనకాలే!
