Site icon NTV Telugu

Venkatesh Trivikram Movie: ఒకే ఫ్రేమ్‌లో వెంకీ మామ – నారా రోహిత్.. త్రివిక్రమ్ ప్లాన్ మామూలుగా లేదుగా!

Venkatesh Trivikram Nara Ro

Venkatesh Trivikram Nara Ro

Venkatesh Trivikram Movie: తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ, సక్సెస్‌పుల్ డైరెక్టర్‌గా పేరు సంపాదించుకున్న వ్యక్తి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రంపై టాలీవుడ్‌లో అంచనాలు ఒక రేంజ్‌లో ఉన్నాయి. ఫ్యామిలీ హీరోగా వెంకటేష్‌కి ఉన్న ఇమేజ్, చక్కిలిగింతలు పెట్టే హాస్యం, హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాల మేళవింపుతో కుటుంబ బంధాలను, విలువలను తెలియజేసే చిత్రాలను తెరకెక్కించడంలో దిట్టైన త్రివిక్రమ్ కలయికలో వస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకులలో కూడా అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్నాయి. తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రంలోకి నారా వారి అబ్బాయి ఎంట్రీ ఇస్తున్నట్లు సినీ సర్కిల్‌లో జోరుగా ప్రచారం జరుగుతుంది.

READ ALSO: యాక్టివ్ కూలింగ్‌తో గేమింగ్ బీస్ట్ గా రాబోతున్న iQOO 15 Ultra.. లాంచ్ ఎప్పుడంటే..?

త్రివిక్రమ్ డైరెక్షన్‌లో విక్టరీ వెంకటేష్ 77వ చిత్రంగా రూపొందుతోన్న ఈ సినిమాకి “ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47” అనే ఆసక్తికర టైటిల్‌ను ఖరారు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రంలో నారా వారి అబ్బాయి నారా రోహిత్ ఒక కీ రూల్‌లో కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తుంది. గతంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘అలా వైకుంఠపురం’ సినిమాలో హీరో అక్కినేని నాగార్జున మేనల్లుడు సుశాంత్ ప్లే చేసిన కీ రోల్ లాంటి ఇంపార్టెంట్ పాత్రను.. వెంకటేష్‌తో తెరకెక్కిస్తున్న “ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47” లో నారా రోహిత్ కోసం తీర్చిదిద్దినట్లు సమాచారం. ఇదే నిజమైతే ఒకే ఫ్రేమ్‌లో వెంకీ మామ- నారా రోహిత్ కలిసి చేసే సందడి మామూలుగా ఉండదు. కానీ ఇప్పటి వరకు ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక & హాసిని క్రియేషన్స్ పతకంపై ఎస్.రాధాకృష్ణ(చినబాబు) ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

READ ALSO: India: ఈ రెండు ముస్లిం దేశాల్లో భారత్‌కు అసలైన ‘స్నేహితుడు’ ఎవరు?

Exit mobile version