తెలుగు సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ రెండో కూతురి వివాహం జరుగుతుంది.. తన కూతురికి నిశ్చితార్థం వేడుకను ఘనంగా జరిపిన సంగతి తెలిసిందే.. విజయవాడకి చెందిన ఒక డాక్టర్ ఫ్యామిలీలోని అబ్బాయికి వెంకటేష్ తన రెండో కుమార్తెని ఇస్తున్నారు.. గత ఏడాది అక్టోబర్ లో ఎంగేజ్మెంట్ జరిగిన సంగతి తెలిసిందే.. ఈ వేడుకకు టాలీవుడ్ లోని ప్రముఖులు హాజరైయ్యారు.. ఇప్పుడు సైలెంట్ గా పెళ్లి పనులు మొదలు పెట్టేశారు.. ఆ వేడుక ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
ఈ వివాహం నేడు మార్చి 15న జరగబోతుందట. రామానాయుడు స్టూడియోస్ లో కేవలం కుటుంబసభ్యులు, క్లోజ్ ఫ్రెండ్స్ మధ్య వీరి వివాహ వేడుక జరగనుంది. ఆల్రెడీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి.. గురువారం రాత్రి మెహందీ వేడుకలు మొదలయ్యాయి.. ఆ కార్యక్రమానికి సినీ ప్రముఖులు హాజరై సందడి చేశారు..
మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి నమ్రత, సితార హాజరయ్యారు. అందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. మొన్న నిశ్చితార్థం వేడుకని సైలెంట్ గా చేసేసిన వెంకటేష్.. ఇప్పుడు పెళ్లి వేడుకని కూడా చాలా సింపుల్ గా చేసేస్తున్నారు.. వెంకీకి ముగ్గురు కూతుర్లు అందులో ఒక అమ్మాయి పెళ్లి జరిగిపోయింది.. ఇప్పుడు రెండో అమ్మాయి పెళ్లి జరుగుతుంది.. మూడో అమ్మాయి, ఒక అబ్బాయి ఉన్నారు.. వారిద్దరూ చదువుకుంటున్నారు..
#NamrataShirodkar and #Sitara from Mehendi night of #Venkatesh‘s Daughter #Hayavahini❤️ pic.twitter.com/MXtk2BqSyv
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) March 15, 2024