తెలుగు సీనియర్ హీరో వెంకటేష్ గురించి అందరికీ తెలుసు.. ఫ్యామిలీ కథా చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాడు.. వెంకీ సినిమా కోసం అభిమానులు ఎదురుచూస్తుంటారు అంటే జనాలు ఆయన సినిమాలను ఎంతగా ఆదరిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..వెంకటేష్ తాజాగా ‘జిగర్తాండ డబల్ ఎక్స్తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్నారు. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రాఘవ లారెన్స్, SJ సూర్య మెయిన్ లీడ్స్ లో గతంలో వచ్చిన జిగర్తాండ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కిన జిగర్తాండ డబల్ ఎక్స్ దీపావళి కానుకగా నవంబర్ 10న రిలీజ్ కానుంది..
ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్స్ కోసం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.. వెంకటేష్ గెస్ట్ గా వచ్చారు. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రాఘవ లారెన్స్, వెంకటేష్ కలిసి ప్రేమించుకుందాం రా సినిమాలోని ‘పెళ్లి కల వచ్చేసింది బాల..’ అంటూ సాగే పాటకు స్టెప్పులు వేశారు. వెంకటేష్ ఈవెంట్ కి రాగా ఈ పాట ప్లే చేశారు. దీంతో అప్పట్లో ఈ పాటకు స్టెప్పులు కంపోజ్ చేసిన లారెన్స్ డ్యాన్స్ వేస్తూ వెంకటేష్ ని కూడా వేయమనడంతో వెంకీ కూడా ఆ కాలు కదిపాడు.. అందుకు సంబందించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది..
26 ఏళ్ళ క్రితం వచ్చిన వెంకటేష్ సినిమా ప్రేమించుకుందాం రా లోని పెళ్లికళ వచ్చేసింది బాల.. సిగ్నేచర్ స్టెప్ వేయడంతో ఈ వీడియో వైరల్ గా మారింది. వెంకీ ఫ్యాన్స్ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.. నీలో ఇంకా ఆ జోష్ తగ్గలేదు అంటూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.. ఇక వెంకీ సినిమాల విషయానికొస్తే.. సైందవ సినిమా చేస్తున్నాడు.. మరో రెండు సినిమాలు చేస్తున్నాడు.. త్వరలోనే సినిమా విడుదల కాబోతుంది..
Our Ever Energetic #Venkatesh dance with #raghavalawrence at #jigarthandadoublex event in #hyderabad #victorvenkatesh #lawrence @offl_Lawrence @VenkyMama pic.twitter.com/hqXUIDYFhp
— నేను మీ తెలుగు అమ్మాయి (@Me_TeluguAmmayi) November 4, 2023