MI vs KKR: ముంబయిలోని వాంఖడే స్టేడియం వేదికగా ముంబయి ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ముంబయి జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. ఓపెనింగ్ బ్యాటర్ వెంకటేశ్ అయ్యర్ 104 పరుగులు రాబట్టడంతో ముంబై ఇండియన్స్ ముందు 186 పరుగుల భారీ లక్ష్యం ఉంది.
ఈ మ్యాచ్‌లో తొలి బంతి నుంచి ప్రత్యర్ధి బౌలర్లపై ఎదురుదాడికి దిగిన వెంకటేష్ అయ్యర్.. కేవలం 49 బంతుల్లో 5 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో విధ్వంకర శతకం బాదాడు. ఐపీఎల్‌లో అయ్యర్‌కు ఇది తొలి శతకం కాగా.. కేకేఆర్ తరఫున కేవలం రెండవది మాత్రమే. అరంగేట్రం సీజన్ తొలి మ్యాచ్‌లో బ్రెండన్ మెక్‌కల్లమ్ (158 నాటౌట్) బాదిన సెంచరీ ఒక్కటే ఇప్పటివరకు కేకేఆర్ తరఫున నమోదై ఉంది. అంటే 15 ఏళ్ల తర్వాత కేకేఆర్ తరఫున ఐపీఎల్‌లో రెండో సెంచరీ నమోదైంది.
Read Also: Salaar: షాకింగ్.. విలన్ గా ప్రభాస్..?
జగదీశన్ (0), నితీశ్ రాణా (5), శార్దుల్ ఠాకూర్ (13), రింకూ సింగ్(18), ఆండ్రూ రసెల్ (21*), సునీల్ నరైన్ (2*) పేలవ ప్రదర్శన చేశారు. ఇక, ముంబయి బౌలర్లలో హృతిక్ శోకీన్ 2 వికెట్లు పడగొట్టాడు. కామెరూన్ గ్రీన్, జాసెన్, పీయుశ్ చావ్లా, మెరెడిత్ ఒక్కో వికెట్ చొప్పున తీశారు.
నేటి మ్యాచ్ ద్వారా ఐపీఎల్ ఆరంగ్రేటం చేసిన అర్జున్ టెండూల్కర్, ఇన్నింగ్స్ తొలి ఓవర్ వేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. మొదటి ఓవర్‌లో 4 పరుగులే ఇచ్చిన అర్జున్ టెండూల్కర్, చక్కని లైన్ అండ్ లెంగ్త్‌తో పాటు స్వింగ్ కూడా చూపించి ఇంప్రెస్ చేశాడు. టాస్ ఓడి మొదలెట్టిన కోల్‌కత్తా నైట్ రైడర్స్‌కి శుభారంభం దక్కలేదు.