NTV Telugu Site icon

Saindhav : సైకో గా వెంకటేష్.. ఆసక్తి రేకెత్తిస్తున్న సైంధవ్ టీజర్..

Whatsapp Image 2023 10 16 At 2.34.37 Pm

Whatsapp Image 2023 10 16 At 2.34.37 Pm

వెంకటేష్ సోలో హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ సైంధవ్.. తాజాగా ఈ మూవీ టీజర్‌ సోమవారం రిలీజైంది. అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్‌ మరియు విజువల్స్‌తో ఈ టీజర్ ఆసక్తిని రేకెత్తిస్తుది . గత సినిమాలకు పూర్తి భిన్నంగా యాక్షన్ రోల్‌లో వెంకటేష్ అదరగొట్టాడు.ఫ్యామిలీ ఎపిసోడ్స్‌తో టీజర్ ప్రారంభమైంది. చంద్రప్రస్థ అనే టౌన్‌లో తన భార్య, కూతురితో కలిసి వెంకటేష్ సంతోషంగా జీవిస్తున్నట్లు ఈ టీజర్ లో చూపించారు.ఆ తర్వాత నవాజుద్దీన్ సిద్ధిఖీ ఎంట్రీ తో కంప్లీట్ యాక్షన్ మోడ్‌లోకి టీజర్ తీసుకెళ్ళింది.వికాస్ అనే కరుడుగుట్టిన క్రిమినల్‌గా ఈ టీజర్‌లో నవాజుద్ధీన్ సిద్ధిఖీని చూపించారు దర్శకుడు శైలేష్ . తనకు అడ్డొచ్చిన వారందరికి దారుణంగా చంపేస్తూ నవాజుద్ధీన్ సిద్ధిఖీ కనిపించాడు. సైకోగా వెంకటేష్ ఎంట్రీ టీజర్‌లో హైలైట్ గా నిలుస్తుంది.. ఓ సారి కత్తి, మరోసారి గన్ పడుతూ వెంకీని ఎంతో పవర్‌ఫుల్‌గా టీజర్‌లో ఆవిష్కరించారు.

వెంకటేష్‌పై చిత్రీకరించిన యాక్షన్ ఎపిసోడ్స్ టీజర్‌కు ఎంతో హైలైట్‌గా నిలుస్తోంది. వెళ్లేముందు చెప్పెళ్ల… వినలేదు. అంటే భయం లేదు. లెక్క మారుద్దిరా నా కొడక్కల్లారా అంటూ టీజర్ చివరలో వెంకటేష్ చెప్పిన డైలాగ్‌ హైలైట్‌గా నిలిచింది. ఈ టీజర్ వెంకటేష్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.చిన్న పిల్లలకు గన్ ట్రైనింగ్ ఇచ్చి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్‌కు సప్లై చేసే గ్యాంగ్‌ను ఎదురించే వ్యక్తిగా ఈ సినిమాలో వెంకటేష్ కనిపిస్తోన్నట్లుగా టీజర్ చూస్తే అర్ధమవుతుంది.సైంధవ్ సినిమాకు శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ సినిమా విడుదల కానుంది. అయితే మొదట డిసెంబర్ 22న సైంధవ్‌ను రిలీజ్ చేయాలని అనుకున్నారు.కానీ అదే డేట్‌కు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సలార్ మూవీ తో బరిలో నిలవడంతో సైంధవ్ సినిమాను సంక్రాంతికి వాయిదావేశారు. సైంధవ్ సినిమాతో బాలీవుడ్ నటుడు నవాజుద్ధీన్ సిద్ధికీ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమాలో శ్రద్ధాశ్రీనాథ్‌, ఆండ్రియా, రుహాణి శర్మ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

Show comments