Lunar Eclipse: శివయ్య భక్తులకు అలర్ట్.. ఆ రోజున వేములవాడ రాజన్న, భీమన్న ఆలయాల మూసివేత

  • శివయ్య భక్తులకు అలర్ట్
  • ఆ రోజున వేములవాడ రాజన్న, భీమన్న ఆలయాల మూసివేత
  • చంద్రగ్రహణం సందర్భంగా మార్చి 3 న
Vemulawada

Vemulawada

కేతు గస్త్ర పాక్షిక చంద్రగ్రహణం సందర్భంగా మార్చి 3 న ఉదయం ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి, శ్రీ భీమేశ్వర స్వామి ఆలయాలను మూసివేయనున్నట్లు ఆలయ అర్చకులు శరత్ శర్మ తెలిపారు. మార్చ్ 3 మంగళవారం ఉదయం ప్రాత:కాల పూజ అనంతరం రాజన్న ఆలయంతో పాటు అన్ని అనుబంధ దేవాలయాలను మూసివేస్తారు. అదే రోజు రాత్రి 7 గంటలకు సంప్రోక్షణ అనంతరం యధావిధిగా పూజలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.

Also Read:Instagram: టీనేజర్ల కోసం ఇన్‌స్టా న్యూ ఫీచర్.. ఇకపై పదే పదే వెతికారో..

మధ్యాహ్నం 3.30కి ప్రారంభమయ్యే పాక్షిక చంద్రగ్రహణం సాయంత్రం 6 గంటలకు ముగుస్తుంది. గ్రహణ సమయంలో జపాలు గ్రహణ పట్టు విడుపు స్నానాలు చేయాలని, గ్రహణము పుబ్బ, ముఖ నక్షత్ర జాతకులు సింహ కుంభ రాశి వారు గ్రహణాన్ని చూడరాదని గ్రహణ మోక్షం అనంతరం ఆలయాలను సందర్శించి అర్చకులకు శక్తి మేర దాణాలను సమర్పించాలని ఆలయ అర్చకులు తెలిపారు.