Site icon NTV Telugu

Vemulawada: గుండెపోటుతో మృతి చెందిన అభ్యర్థి సర్పంచిగా గెలుపు.. ఇప్పుడు ఎలా మరీ..?

Brs

Brs

Vemulawada: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం చింతల్ ఠానా ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది.. గుండెపోటుతో ఇటీవల మృతి చెందిన అభ్యర్థి సర్పంచిగా గెలుపొందారు.. వేములవాడ అర్బన్ మండలంలోని చింతల్ ఠానా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన చెర్ల మురళి తన సమీప ప్రత్యర్థి పై 370 ఓట్లతో గెలుపొందారు.. కానీ.. చెర్ల మురళి ఈనెల 5వ తేదీన గుండెపోటుతో మృతి చెందారు.. మొత్తం 1717 ఓట్లు పోల్ కాగా, బీఆర్ఎస్ చెర్ల మురళి 739, బీజేపీ సురువు వెంకటి 369, కాంగ్రెస్ కోలాపురి రాజమల్లు 333 ఓట్ల వచ్చాయి. మరోవైపు.. ఉప వార్డు సభ్యులు సర్పంచ్‌గా కుమార్‌ను ఎన్నుకున్నారు. గెలిచిన అభ్యర్థి మృతి చెందడంతో సర్పంచ్ ఎన్నికను ప్రకటించకుండా ఎలక్షన్ కమిషన్‌కు పంపిస్తామని అధికారులు తెలిపారు. ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. దీంతో ఏం జరగనుందా? అనే ఉత్కంఠ మొదలైంది.

READ MORE: Nandyal: ఆళ్లగడ్డలో తప్పిన ఘోర రోడ్డు ప్రమాదం.. కర్నూలు బస్సు దగ్ధం తరహాలో యాక్సిడెంట్

కాగా.. ప్రజా సేవ చేయాలనే తపనతో ఎంతో ఉత్సాహంగా సర్పంచ్ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించిన అభ్యర్థి మురళి.. గెలుపునకు ఒక్క అడుగు దూరంలో ఈనెల 5న అకస్మాత్తుగా గుండెపోటుతో మృతి చెందారు. బీఆర్‌ఎస్ పార్టీ మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన చెర్ల మురళి నిన్న అకస్మాత్తుగా కుప్పకూలారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తూ ఎంతో ఉత్సాహంగా ఒక రోజు ముందు (డిసెంబర్ 4) వరకు ప్రచారం నిర్వహించిన చెర్ల మురళి, గ్రామస్థులకు ప్రజాసేవ చేయాలని ఎన్నో కలలు కన్నారు. గ్రామాభివృద్ధికి మెరుగైన ప్రణాళికలతో ముందుకు సాగుతున్న మురళి అర్ధాంతరంగా మృతి చెందడంతో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.

READ MORE: Ind vs SA: ఫలించని తిలక్ వర్మ ఒంటరి పోరాటం.. దక్షిణాఫ్రికా చేతిలో టీమిండియా చిత్తు..!

Exit mobile version