Site icon NTV Telugu

Minister Nimmala Ramanaidu: 2026 నాటికి వెలిగొండ పూర్తి చేసి నల్లమల సాగర్‌ను కృష్ణా జలాలతో నింపుతాం..

Nimmala

Nimmala

Minister Nimmala Ramanaidu: వెలిగొండ ప్రాజెక్ట్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, 2026 నాటికి ప్రాజెక్ట్‌ను పూర్తిచేసి నల్లమల సాగర్‌ను కృష్ణా జలాలతో నింపే లక్ష్యంతో ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆంధ్రప్రదేశ్‌ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. స్థానిక రైతులతో కలిసి వెలిగొండ ప్రాజెక్ట్ టన్నెల్‌లో 18 కిలోమీటర్ల లోపలికి వెళ్లి క్లిష్టమైన లైనింగ్ పనులను స్వయంగా పరిశీలించిన మంత్రి నిమ్మల.. అనంతరం ఇరిగేషన్ అధికారులు, ఏజెన్సీలతో సమీక్ష నిర్వహించారు.

Read Also: Akhanda 2: బాలయ్య ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘అఖండ 3’ హింట్ చూశారా!

జగన్ పాలనలో వెలిగొండకు తీవ్ర నష్టం జరిగిందని విమర్శించారు మంత్రి నిమ్మల.. ప్రాజెక్టు నిర్మాణంపై గత ప్రభుత్వ హయాంలో తీవ్ర లోపాలు జరిగాయని మంత్రి ఆరోపించారు. జగన్ ప్రభుత్వం వెలిగొండ ప్రాజెక్ట్‌ను పూర్తికాకుండానే జాతికి అంకితం చేసినట్టుగా ప్రకటించడం “దగా, మోసం” అని వ్యాఖ్యానించారు. ప్రాజెక్టులో ఇంకా రూ.4,000 కోట్ల పనులు పెండింగ్‌లో ఉన్నప్పటికీ, పూర్తయినట్టుగా ప్రకటించడం చరిత్రహీన చర్య అన్నారు.

ఇక, కూటమి ప్రభుత్వం విధులు చేపట్టిన తర్వాత హెడ్ రెగ్యులేటర్ వద్ద 2,200 క్యూబిక్ మీటర్ల కాంక్రీటింగ్ పనులు పూర్తి చేశామని.. కేవలం 18 నెలల్లో 3 కిలోమీటర్ల క్లిష్టమైన టన్నెల్ లైనింగ్ పనులు పూర్తి అయ్యాయని వివరించారు నిమ్మల.. ప్రస్తుతం 4 గ్యాంట్రీలతో రోజుకు 12 మీటర్ల లైనింగ్ పనులు, గ్యాంట్రీల సంఖ్యను మరింత పెంచాలని ఆదేశాలు జారీ చేశాం.. ఫీడర్ కెనాల్‌లో అవసరమైన 45,000 క్యూబిక్ మీటర్ల హార్డు రాక్ పనుల్లో 28,000 క్యూబిక్ మీటర్ల పూర్తి చేశాం.. ఫీడర్ కెనాల్ లైనింగ్, రిటైనింగ్ వాల్ నిర్మాణానికి రూ.456 కోట్ల టెండర్లు పూర్తి చేశాం.. టెండర్ పనులు ఈ డిసెంబరు నుంచే ప్రారంభించాలని ఆదేశాలు ఇచ్చాం.. తీగలేరు కెనాల్‌కు సంబందించి 600 మీటర్ల టన్నెల్ లైనింగ్, గేట్ల వ్యవస్థ నిర్మాణం కొనసాగుతుంది అన్నారు..

ఇక, నల్లమలసాగర్ ముంపు ప్రాంతంలో 9.6 కిలోమీటర్ల డైవర్షన్ రోడ్ నిర్మాణం ప్రారంభం అయ్యాయి.. మంథా తుఫాను కారణంగా దెబ్బతిన్న ఫీడర్ కెనాల్ గండ్లు పూడ్చడం, జంట సొరంగాల్లో డీవాటరింగ్ పూర్తి చేసి లైనింగ్ పనులు వేగవంతం చేస్తాం అన్నారు మంత్రి నిమ్మల.. సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఇరిగేషన్ రంగం పునరుద్థరణ జరుగుతోంది.. వైఎస్‌ జగన్ పాలనలో ఇరిగేషన్ రంగం తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ, ప్రస్తుత ప్రభుత్వం వ్యవస్థను గాడిలో పెట్టిందని నిమ్మల చెప్పారు. వెలిగొండను అత్యంత ప్రాధాన్యత ప్రాజెక్టుగా ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, లక్ష్యానికి చేరుకునేలా నిరంతర పర్యవేక్షణ చేయాలని ఆదేశించారని వెల్లడించారు. 2026 నాటికి వెలిగొండ ప్రాజెక్టును పూర్తిచేసి, నల్లమల సాగర్‌ను కృష్ణా జలాలతో నింపుతాం” అని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు మంత్రి నిమ్మల రామానాయుడు..

Exit mobile version