Veera Raghava Reddy : మొయినాబాద్‌లో వీర రాఘవరెడ్డిపై దాడి.. వాతలు వచ్చేలా…!
- మరొకసారి దాడికి గురైన వీర రాఘవరెడ్డి
- మొయినాబాద్ వద్ద ఘటన
- మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో వీర రాఘవరెడ్డి ఫిర్యాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Veera Raghava Reddy : గతంలో రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు సీఎస్ రంగరాజన్‌పై దాడి చేసి సంచలనం సృష్టించిన కొవ్వూరి వీర రాఘవరెడ్డి తాజాగా మరోసారి దాడికి గురయ్యాడు. గురువారం (మే 1, 2025) కండిషన్ బెయిల్‌పై మొయినాబాద్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి వస్తుండగా దాదాపు 20 మంది గుర్తు తెలియని వ్యక్తులు అతడిపై దాడికి పాల్పడ్డారు. పోలీస్ స్టేషన్లో సంతకం చేసి తిరిగి వస్తున్న వీర రాఘవరెడ్డి ఓ టీ స్టాల్ వద్ద ఆగగా, అక్కడికి చేరుకున్న దుండగులు ఒక్కసారిగా అతడిపై దాడి చేశారు. ఈ దాడిలో వీర రాఘవరెడ్డికి గాయాలయ్యాయి. స్థానికులు గమనించి అడ్డుకోవడంతో దాడి చేసిన వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం వీర రాఘవరెడ్డి మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
PM Modi Amaravati Tour: అమరావతి రీలాంచ్.. నేడే ఏపీకి ప్రధాని మోడీ
Also Read
- USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
- Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
- Teacher Posts: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. స్కూల్ అసిస్టెంట్లు, హెచ్ఎం పోస్టుల కేడర్ ఫిక్స్.
- CM Chandrababu: జపాన్ స్ఫూర్తితో పరిశుభ్రతా విధానాలు..
అయితే.. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పవరానికి చెందిన కొవ్వూరి వీర రాఘవరెడ్డి ‘రామరాజ్యం’ పేరుతో ఒక ప్రైవేట్ సైన్యాన్ని నడుపుతున్నాడు. దేశంలో రామరాజ్యం స్థాపించాలనే లక్ష్యంతో అతడు ప్రచారం చేస్తున్నాడు. అయితే.. కేవలం పదో తరగతి పాసైన, ఫెయిలైన యువకులను తన సైన్యంలోకి రిక్రూట్ చేసుకుంటున్నాడు. ఈ సైన్యంలో చేరడానికి 5 కిలోమీటర్లు నడవగలగడం, 2 కిలోమీటర్లు పరిగెత్తగలగడం, 20 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండటం వంటి అర్హతలు ఉన్నాయి. ఒక్కొక్కరికి నెలకు రూ. 20 వేల జీతం కూడా ఇస్తున్నట్లు తెలుస్తోంది.
వీర రాఘవరెడ్డి యువతను తన సైన్యంలో చేర్చుకుని వారితో దౌర్జన్యాలకు పాల్పడుతున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో చిలుకూరు బాలాజీ అర్చకుడు రంగరాజన్‌ను తన రామరాజ్యం సైన్యంలో చేరాలని ఒత్తిడి చేశాడు. ఆయన నిరాకరించడంతో తన ప్రైవేట్ సైన్యంతో అర్చకుడి ఇంటిపై తన సైన్యంతో దాడికి దిగాడు. అంతేకాకుండా ఆయన కుమారుడిని కూడా కొట్టించాడని ఆరోపణలు ఉన్నాయి. అంతకుముందు హైదరాబాద్‌లోని అబిడ్స్‌లో కూడా వీర రాఘవరెడ్డిపై దాడి కేసు నమోదైంది. తాజాగా తనపై జరిగిన దాడిపై వీర రాఘవరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. గతంలో అతడిపై ఉన్న ఆరోపణలు, తాజాగా జరిగిన దాడి నేపథ్యంలో పోలీసులు మరింత లోతుగా విచారణ జరిపే అవకాశం ఉంది.
CM Revanth Reddy : నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. ఎందుకంటే..?
తాజావార్తలు
-
Om: ధనుష్ – సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
-
ECIL Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఫీజు, ఎగ్జామ్ లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం! వెంటనే అప్లై చేసుకోండి..
-
USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
-
Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
-
Vaishnavi Wushu : జాతీయ ఉషుకు తెలంగాణ విద్యార్థిని.. వైష్ణవికి కమిషనర్ అభినందనలు.!
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!