VC Sajjanar : ఉద్యోగుల సంపూర్ణ ఆరోగ్యమే సంస్థకు అసలైన సంపద
- ఆర్టీసీ తార్నాక ఆసుపత్రి – సూపర్ స్పెషాలిటీ స్థాయికి అభివృద్ధి
- జీవికే యాదవ్ ప్రశంసలు – కండక్టర్ విజన్‌కు వీసీ సజ్జనర్ స్పందన
- ఉద్యోగుల ఆరోగ్య భద్రత – టీజీఎస్ఆర్టీసీ యొక్క ప్రాధాన్యత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
VC Sajjanar : ఆర్టీసీ తార్నాక ఆసుపత్రిలో అందిస్తోన్న వైద్య సేవలను వీడియో రూపంలో తెలియపరిచి.. ప్రశంసించాడు కూకట్ పల్లి డిపో కండక్టర్ జీవికే యాదవ్. దీంతో కండక్టర్ ను అభినందిస్తూ టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ ట్వీట్ చేశారు. ఆసుపత్రి విషయంలో కండక్టర్ ఇచ్చిన విలువైన సలహాలు, సూచనలను పరిగణలోకి తీసుకుని.. మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు యాజమాన్యం కట్టుబడి ఉందని వెల్లడించారు. ట్వీట్ లో… TGSRTC అనేది 45 వేల మంది ఉద్యోగ సమూహంతో కూడిన అతిపెద్ద ఉమ్మడి కుటుంబం. కుటుంబ సభ్యుడైన ప్రతి ఉద్యోగి , జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య భద్రత సంస్థ బాధ్యత. అందుకే ఉద్యోగులు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటేనే సంస్థ కూడా ఉన్నతంగా ఉంటుందని భావించి 2021లో ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి పెద్ద పీట వేయడం జరిగింది. తార్నాకలోని ఆర్టీసీ ఆసుపత్రిని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గా సంస్థ ఆధునీకరించింది.
Also Read
- Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
- Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
- Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
- CJP Protest: "మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు".. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
దేశంలో ఏ రాష్ట్ర ఆర్టీసీలో లేనివిధంగా ఉద్యోగులకు ఇక్కడ కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా మెరుగైన వైద్య పరీక్షలను నిర్వహిస్తూ.. నాణ్యమైన వైద్య సేవలను సంస్థ అందిస్తోంది. ఫలితంగానే తార్నాక ఆసుపత్రిలో గతంలో ప్రతి రోజు సగటున 600 ఓపీ ఉండగా.. ప్రస్తుతం అది 1500కి పెరిగింది. 24/7 ఫార్మసి సదుపాయాన్ని ఉద్యోగులతో పాటు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంచడం జరిగింది. జీవికే యాదవ్, కండక్టర్ కూకట్పల్లి డిపో గారు తార్నాక ఆస్పత్రి పనితీరును అక్కడ అందిస్తోన్న వైద్య సేవలను వీడియో రూపంలో తెలియపరిచి.. ప్రశంసించడం అభినందనీయం. ఆసుపత్రి విషయంలో ఆయన ఇచ్చిన విలువైన సలహాలు, సూచనలను పరిగణలోకి తీసుకుని.. మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు యాజమాన్యం కట్టుబడి ఉంది.’ అని వీసీ సజ్జనార్ అన్నారు.
తాజావార్తలు
-
Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
Volkswagen ID.Tiguan EV: 600 కి.మీ. రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు ఇవే!
-
CJP Protest: “మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు”.. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
ట్రెండింగ్
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!