Varun Tej : సెన్సార్ పూర్తి చేసుకున్న వరుణ్ తేజ్ ‘గాండీవధారి అర్జున’..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘గాండీవధారి అర్జున’.బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ గా రూపొందిన ఈ సినిమాను దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఎంతో గ్రాండ్ గా తెరకెక్కించారు.ఈ సినిమా ఆగస్టు 25 న థియేటర్లలో ఎంతో గ్రాండ్ గా విడుదల అయ్యేందుకు సిద్ధం అవుతుంది. రీసెంట్ గా గాండీవధారి అర్జున సినిమా ట్రైలర్‌ను విడుదల చేసారు మేకర్స్…ఈ ట్రైలర్ ఆద్యంతం యాక్షన్ సీక్వెన్స్‌లతో అదిరిపోయింది. యాక్షన్ సీన్లు, కారు చేజింగ్‍లతో ట్రైలర్ లో ఎంతో ఆసక్తికరం గా చూపించారు.. యాక్షన్ మోడ్‍లో హీరో వరుణ్ తేజ్ అదరగొట్టాడనే టాక్ కూడా వినిపిస్తోంది. ఈ సినిమాలో పర్యావరణ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి పాత్రలో సీనియర్ నటుడు నాజర్ ఎంతో అద్భుతంగా నటించినట్లు సమాచారం.ఆయన క్రిమినల్స్ కు టార్గెట్ గా మారుతారు.. ఆయనను కాపాడే బాధ్యతను ఓ ఏజెన్సీ తరఫున అర్జున్ (వరుణ్ తేజ్) చేపడతారు..
దేశం కోసం మరో మిషన్‍ను హీరో అర్జున్ కు నాజర్ అప్పగిస్తారు. ఈ సినిమా ట్రైలర్‌లో ని ఈ అంశాలన్నీ ఎంతో ఆసక్తికరంగా చూపించాడు దర్శకుడు ప్రవీణ్ సత్తారు.. ఈ చిత్రంలో హీరోయిన్ సాక్షి వైద్య కూడా యాక్షన్ పాత్రలోనే కనిపించింది. ఈ సినిమాకు ఫీల్ గుడ్ మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు.ట్రైలర్ లో మిక్కి అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. ఈ సినిమాలో విమలా రామన్, వినయ్ రాయ్, రోషిణి ప్రకాశ్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.ఇదిలా ఉంటే ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకొని U/A సర్టిఫికెట్ పొందినట్లు హీరో వరుణ్ తేజ్ తన ట్విట్టర్ అకౌంట్ లో ఒక పిక్ ను పోస్ట్ చేసారు. ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మరి ఈ సినిమా విడుదలైన తరువాత ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
Also Read
- Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
- APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
- Vaibhav's Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి... నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
- Pentagon Lockdown: పెంటగాన్‌లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
https://twitter.com/IAmVarunTej/status/1692080426511454707?s=20
తాజావార్తలు
-
Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
-
APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్‌లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
Off The Record: బోధన్‌లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్‌తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్‌లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!