Site icon NTV Telugu

Varun Tej-Lavanya Tripathi Marriage: ఆ విధంగా అంటూ.. కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపిన మెగాస్టార్!

Untitled Design (3)

Untitled Design (3)

Chiranjeevi Shares Varun Tej and Lavanya Tripathi’s Wedding Pic: ఆరేళ్ల ప్రేమించుకున్న టాలీవుడ్ స్టార్స్ వరుణ్‌ తేజ్‌, లావణ్య త్రిపాఠి వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇటలీలోని టస్కానీలో బుధవారం రాత్రి 7.18 గంటలకు వరుణ్‌-లావణ్యల వివాహం ఘనంగా జరిగింది. ఇరు కుటుంబసభ్యులు, అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో లావణ్య మెడలో వరుణ్‌ మూడుముళ్లు వేశారు. వరుణ్‌-లావణ్యల వివాహంకు సంబందించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అందరూ నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

వరుణ్‌ తేజ్‌, లావణ్య త్రిపాఠిల వివాహంకు మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. పెళ్లిలో ఆయన ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మనుమరాళ్లతో ఆడుకుంటూ సందడి చేశారు. ఇక పెళ్లి అనంతరం కుటుంబసభ్యులతో దిగిన ఫొటోను తన ఎక్స్‌లో షేర్ చేసి.. కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు. ‘ఆ విధంగా.. వరుణ్‌ తేజ్‌, లావణ్య త్రిపాఠి కలిసి కొత్త ప్రేమతో నిండిన ప్రయాణాన్ని ప్రారంభించారు. కొత్త స్టార్ జంటకు శుభాకాంక్షలు’ అని పేర్కొన్నారు.

Also Read: Hardik Pandya Injury Status: భారత్‌కు బ్యాడ్‌ న్యూస్‌.. హార్దిక్‌ పాండ్యా ఆడడం కష్టమే!

తేజ్‌, లావణ్య త్రిపాఠి వివాహంకు చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌, రామ్‌ చరణ్‌, అల్లు అర్జున్‌, అల్లు శిరీష్, సాయి తేజ్, వైష్ణవ్ తేజ్, నిహారిక, స్నేహ రెడ్డి సహా కొణిదెల, అల్లు కుటుంబానికి చెందిన వారు అందరూ హాజరయ్యారు. నితిన్‌, ఆయన సతీమణి షాలినీ.. నీరజా కోన కూడా ఈ సెలబ్రేషన్స్‌లో భాగమయ్యారు. ఇక సినీ ఇండస్ట్రీ, ప్రముఖుల కోసం నవంబర్‌ 5న హైదరాబాద్‌లోని మాదాపూర్‌ ఎన్‌-కన్వెన్షన్‌లో రిసెప్షన్‌ నిర్వహించనున్నారు.

Exit mobile version