Varun Tej-Lavanya Tripathi Marriage: ఆ విధంగా అంటూ.. కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపిన మెగాస్టార్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chiranjeevi Shares Varun Tej and Lavanya Tripathi’s Wedding Pic: ఆరేళ్ల ప్రేమించుకున్న టాలీవుడ్ స్టార్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇటలీలోని టస్కానీలో బుధవారం రాత్రి 7.18 గంటలకు వరుణ్-లావణ్యల వివాహం ఘనంగా జరిగింది. ఇరు కుటుంబసభ్యులు, అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో లావణ్య మెడలో వరుణ్ మూడుముళ్లు వేశారు. వరుణ్-లావణ్యల వివాహంకు సంబందించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అందరూ నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల వివాహంకు మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. పెళ్లిలో ఆయన ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మనుమరాళ్లతో ఆడుకుంటూ సందడి చేశారు. ఇక పెళ్లి అనంతరం కుటుంబసభ్యులతో దిగిన ఫొటోను తన ఎక్స్‌లో షేర్ చేసి.. కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు. ‘ఆ విధంగా.. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి కలిసి కొత్త ప్రేమతో నిండిన ప్రయాణాన్ని ప్రారంభించారు. కొత్త స్టార్ జంటకు శుభాకాంక్షలు’ అని పేర్కొన్నారు.
Also Read
- VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్‌ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
- Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
- CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
- Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
Also Read: Hardik Pandya Injury Status: భారత్‌కు బ్యాడ్ న్యూస్.. హార్దిక్ పాండ్యా ఆడడం కష్టమే!
తేజ్, లావణ్య త్రిపాఠి వివాహంకు చిరంజీవి, పవన్ కల్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, అల్లు శిరీష్, సాయి తేజ్, వైష్ణవ్ తేజ్, నిహారిక, స్నేహ రెడ్డి సహా కొణిదెల, అల్లు కుటుంబానికి చెందిన వారు అందరూ హాజరయ్యారు. నితిన్, ఆయన సతీమణి షాలినీ.. నీరజా కోన కూడా ఈ సెలబ్రేషన్స్‌లో భాగమయ్యారు. ఇక సినీ ఇండస్ట్రీ, ప్రముఖుల కోసం నవంబర్ 5న హైదరాబాద్‌లోని మాదాపూర్ ఎన్-కన్వెన్షన్‌లో రిసెప్షన్ నిర్వహించనున్నారు.
.. And thus they embarked together on a new love filled journey 💕
Starry Wishes for the Newest Star Couple ! 😍🤗@IAmVarunTej @Itslavanya pic.twitter.com/ognVfZ93Iv
— Chiranjeevi Konidela (@KChiruTweets) November 2, 2023
తాజావార్తలు
-
VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్‌ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
-
Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
-
Don’t Trouble The Trouble: రాజమౌళికి బిగ్ షాక్
-
Srikanth Odela: సుకుమార్ కోసం.. ఇండియాలోనే నెం.1 డైరెక్టర్ ఆఫర్‌కి ‘నో’ చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
-
Matsya: పడవ కింద నుంచి వెళ్లిన ‘మిథికల్ ఫిష్’.. టాలీవుడ్లో మరో గ్రాండ్ విజువల్ వండర్ ‘మత్స్య’!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!