మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లేటెస్ట్ మూవీ ఆపరేషన్ వాలెంటైన్ ఇటీవల విడుదలై భారీ విజయాన్ని అందుకుంది.. ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ అడ్వెంచర్ మూవీ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బ్యాక్ గ్రౌండ్లో తెరికెక్కినటువంటి ఈ సినిమా మార్చి 1వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకుంది. ఇక ఈ సినిమాలో వరుణ్ తేజ్ నటన ఎంతో అద్భుతంగా ఉందని చెప్పాలి.. ఈ సినిమా స్టోరీ అందరికీ నచ్చడంతో సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది..
ఇక కలెక్షన్స్ కూడా భారీగానే అందుకుంటుంది.. అయితే ఇప్పుడు నెట్టింట ఓ వార్త చక్కర్లు కొడుతుంది.. వరుణ్ తేజ్ లేడీ ఫ్యాన్ నిర్ణయం పై ప్రశంసలు కురుస్తున్నాయి.. సోషల్ మీడియాలో తాను చేసిన మెసేజ్ కు హీరో వరుణ్ తేజ్ రిప్లై ఇస్తే 200 మంది అనాధ పిల్లలకు సినిమా చూపిస్తాను అని చెప్పింది.. ఈ మెసేజ్ కు వరుణ్ రిప్లై ఇవ్వడంతో ఆమె తన మాట నిలబెట్టుకుంది.. ఆపరేషన్ వాలంటైన్ సినిమాని అనాధ పిల్లలకు
ఉచితంగా చూపించారు..
హైదరాబాద్ లోని గోకుల్ ధియేటర్లో ఏకంగా 200 మంది అనాధ విద్యార్థులకు ఉచితంగా ఈ సినిమాని చూపించారు. ఇలా ఈ సినిమా చూసినటువంటి విద్యార్థులందరూ కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.. తమకూ ఎయిర్ ఫోర్స్ లో చేరాలని అనిపించేలా ఈ సినిమా తమలో స్ఫూర్తి నింపిందని విద్యార్ధినులు పేర్కొన్నారు. సాయి సేవా సంఘ్ విద్యార్ధినులకు ఈ ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఇక ఈ విద్యార్థినులందరికీ కూడా ప్రయాణంతో పాటు సినిమా స్నాక్స్ అన్నింటినీ కూడా ఉచితంగానే అందించడంతో ఈ సాయి సేవ సంఘ నిర్వాహకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..
