Site icon NTV Telugu

Varun Chakravarthy Love Story: “నువ్వు క్రికెట్ ఆడు.. నేను సంపాదిస్తాను” మిస్టరీ స్పిన్నర్ క్యూట్ లవ్ స్టోరీ!

Varun Chakravarthy

Varun Chakravarthy

Varun Chakravarthy Love Story: టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టి20 లలో ప్రత్యర్థి జట్లకు తన మిస్టరీ స్పిన్ తో మూడు చెరువుల నీళ్లు తాపించి బ్యాటర్లను బోల్తా కొట్టించడంలో దిట్ట. తన ప్రతిభతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన వరుణ్.. తన విజయానికి వెనుక ఓ అందమైన ప్రేమకథ ఉందని తాజాగా బయట పడింది. అదే ఆయన భార్య ‘నేహా ఖేడేకర్’ ఇచ్చిన ప్రోత్సాహమే. ఆవును ఆమె ఇచ్చిన భరోసానే వరుణ్ జీవితాన్ని పూర్తిగా మార్చింది. “నువ్వు క్రికెట్ ఆడు.. నేను సంపాదిస్తాను” అంటూ ఆమె ఇచ్చిన మాట.. ఆయనను భారత జట్టులో ఆడేందుకు దారి తీసింది.

India T20 World Cup History: రెండు సార్లు ఛాంపియన్‌గా, ఒకసారి రన్నరప్ గా.. మరీ ఈసారి?

వరుణ్ చక్రవర్తి కర్ణాటకలోని బీదర్‌కు చెందినవాడు. ఆయన చెన్నైలోని SRM యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్ చదువుతున్న సమయంలో నేహా ఖేడేకర్‌ ను కలిశాడు. మొదట స్నేహంగా ప్రారంభమైన వారి పరిచయం, క్రమక్రమంగా అది ప్రేమగా మారి.. కాలేజ్ రోజుల్లోనే ఇద్దరూ ఎన్నో కష్టసుఖాలు ఎదుర్కొన్నారు. చదువు పూర్తయ్యాక వరుణ్ ఒక మంచి ఆర్కిటెక్ట్ ఉద్యోగం సంపాదించాడు. కానీ, ఆయన మనసు మాత్రం క్రికెట్‌ పైనే ఉండేది. భారత జట్టుకు ఆడాలని ఉన్న కల కోసం ఉద్యోగాన్ని వదిలేయాలని అనుకున్నప్పుడు.. తన పరిస్థితిని నేహాకు వివరించాడు. “నా దగ్గర ఉద్యోగం లేదు.. భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదు.. నన్ను నమ్మకు” అని చెప్పాడట.

ఆ సమయంలో భార్య నేహా ఇచ్చిన సమాధానం ఆయన జీవితాన్ని మార్చేసింది. “నువ్వు క్రికెట్ ఆడు.. నెలకు 5 వేలు వచ్చినా సరే.. నేను సంపాదిస్తున్నాను.. మనం మేనేజ్ చేసుకుందాం” అని ఆమె చెప్పింది. ఇక అంతే భార్య ఇచ్చిన ధైర్యం వరుణ్‌ కు కొత్త నమ్మకాన్ని ఇచ్చింది. అదే ఆయనను క్రికెట్‌లో ముందుకు నడిపించింది. భార్య ఇచ్చిన ప్రోత్సాహంతో వరుణ్ తన పూర్తి దృష్టిని క్రికెట్‌ పై మళ్ళించాడు.

T20 World Cup 2026 India: భారత్ సెమీస్‌కు చేరదు.. ‘కుక్క తోక వంకర’లా పాక్ ఆటగాడి వ్యాఖ్యలు!

దీనితో 2018లో తమిళనాడు ప్రీమియర్ లీగ్‌ (TPL)లో అద్భుత ప్రదర్శన చేసి గుర్తింపు పొందాడు. ఆ తర్వాత ఐపీఎల్ లో అవకాశాలు అందుకుని, తన మిస్టరీ స్పిన్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు. నేహా నమ్మకం, ప్రోత్సాహం లేకపోతే ఈ స్థాయికి చేరుకోవడం కష్టమేనని వరుణ్ స్వయంగా పలుమార్లు చెప్పాడు. డిసెంబర్ 12, 2020లో వరుణ్, నేహా వివాహం సన్నిహితుల మధ్య వీరి వివాహం జరిగింది. వీరికి 2022 నవంబర్ 10న ‘ఆత్మన్’ జన్మించాడు.

Exit mobile version