NTV Telugu Site icon

Viral Video: కరెంట్ షాక్ తో గిలగిల్లాడిన బాలుడు.. కాపాడిన వృద్ధుడు

Viral Video

Viral Video

కరెంట్ షాక్ కొట్టి విలవిల్లాడుతున్న ఓ బాలుడి ప్రాణాలను ఓ ముసలాయన చాకచక్యంగా కాపాడాడు. ఉత్తర్ ప్రదేశ్ లో జరిగిన ఈ ఘటన అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వారణాసిలో నివసిస్తున్న ఓ బాలుడు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నాడు. కరెంటు సరఫరా అవుతున్న వైరు నేలపై ఉన్న నీటిలో పడటంతో సదరు బాలుడికి షాక్ తగిలింది. ఇది గమనించిన వాహనదారులు తమ వాహనాలు ఆపివేశారు. అదే టైంలో బాలుడ్ని కాపాడటానికి ట్రై చేశారు. అదే సమయంలో ఓ వృద్ధుడు కర్రను తీసుకొచ్చాడు. దానిని పట్టుకోవాలని ఆ బాలుడికి సూచించాడు. బాలుడు బాధను దిగమింగుతూ కర్రను పట్టుకుని కరెంటు సరఫరా అవుతున్న వైరును వదిలించుకునేందుకు ట్రై చేశాడు. అయితే, ఆ వృద్ధుడు బాలుడ్ని మరో పక్కకు లాగే సరికి కరెంట్ షాక్ నుంచి తప్పించుకున్నాడు. సదరు ముసలాయన సాహసానికి స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Read Also: Lentil imports: కెనడా నుంచి ఇండియాకి తగ్గిన పప్పు ధాన్యాల దిగుమతులు..

సదరు ముసలాయన ధైర్యంగా ఆ బాలుడిని రక్షించడం చూసిన వారంతా ఆశ్చర్యానికి లోనయ్యారు. తన కుమారుడి ప్రాణాలను కాపాడినందుకు ఆ వృద్ధునికి బాలుడి తల్లి కృతజ్ఞతలు తెలియజేసింది. ఆమె అతన్ని గట్టిగా కౌగిలించుకుని ధన్యవాదములు చెప్పింది. ఆ వృద్ధుడు తనకు సహాయం చేయగలిగినందుకు సంతోషంగా ఉందన్నాడు. అదే పరిస్థితిలో ఏ వ్యక్తి చేయని పని తాను చేశానని తెలిపారు. తల్లిదండ్రులు మరింత అప్రమత్తంగా ఉండాలి.. విద్యుత్తు వల్ల కలిగే అనర్థాలపై పిల్లలకు సరైన అవగాహన కల్పించాలని ఆయన వెల్లడించారు. వృద్ధుడి ఆలోచన, ధైర్యం బాలుడి ప్రాణాలను కాపాడి.. అతను నిజమైన హీరో అని నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.